పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శక సూత్రాలను పేర్కొంటాయి. ఆత్మాజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాథలను పురాణాల ద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి ఉంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రుజుమార్గంలో నడిపిస్తాయి కనుక. మంచిపనులు చేసి లోకోపకారం కలిగించి తరించిన మహనీయుల జీవితాలను చదివి ఆకళింపు చేసుకొని సత్కర్మలు చేయడానికి మనమూ ముందడుగు వేస్తాం. చెడుపనులు చేసి పతనమైన వారి కథలు చదివి దుష్కర్మలకు దూరంగా ఉంటాం.
పురాణాలన్నీ మనం ఆచరించాల్సిన ధర్మాలను కథారూపంగా వివరిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలను, ఆచరించకపోతే కలిగే అనర్థాలను తెలియచెబుతాయి. ప్రతీ మనిషి నిష్కామంగా స్వధర్మాచరణ చేయాలని బోధిస్తాయి. తప్పక అందరు ఈ పుస్తకం చదవవలసిందిగా కోరుచున్నాము.
పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శక సూత్రాలను పేర్కొంటాయి. ఆత్మాజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాథలను పురాణాల ద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి ఉంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రుజుమార్గంలో నడిపిస్తాయి కనుక. మంచిపనులు చేసి లోకోపకారం కలిగించి తరించిన మహనీయుల జీవితాలను చదివి ఆకళింపు చేసుకొని సత్కర్మలు చేయడానికి మనమూ ముందడుగు వేస్తాం. చెడుపనులు చేసి పతనమైన వారి కథలు చదివి దుష్కర్మలకు దూరంగా ఉంటాం. పురాణాలన్నీ మనం ఆచరించాల్సిన ధర్మాలను కథారూపంగా వివరిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలను, ఆచరించకపోతే కలిగే అనర్థాలను తెలియచెబుతాయి. ప్రతీ మనిషి నిష్కామంగా స్వధర్మాచరణ చేయాలని బోధిస్తాయి. తప్పక అందరు ఈ పుస్తకం చదవవలసిందిగా కోరుచున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.