నార్ల వారి పురాణనాటకాల్లో "సీత జోస్యం" రెండవది. పాఠకుల ఆమోదం కాక ఆలోచన కావాలనీ, ప్రశంస కాకుండా జిజ్ఞాస కావాలనీ, పాత విషయాలను కొత్త దృష్టితో చూడాలనీ, పాత విశ్వాసాలకు కొత్త పరీక్షలు పెట్టాలనీ, పాత గాధలకు కొత్త వ్యాఖ్యానాలు చెప్పుకోవాలనీ కోరుతూ నార్లవారు సీతజోస్యానికి పీఠిక రాశారు. జన బాహుళ్యంలో ప్రత్యేకించి మాట విశ్వాసాలను అనుకరిస్తున్న వారిలో స్తబ్దత పోవాలనీ, సంచలనం రావాలనీ, ఉదాసీనం గతించాలనీ, "విస్సన్నల" పట్ల, వారి "వేదాల" పట్ల గౌరవం తగ్గాలనీ ఆయన ఆశించారు. మానసిక పరివర్తన, నవచైతన్యం, పురోగతినే ఆయన లక్షించారు. జాతి, మత, కుల విభేదాలన్నీ సమసిపోవాలనీ, సమతా స్వాతంత్ర్యాలు సర్వత్రా నెలకొనాలనీ, దారిద్ర్యం, దైన్యం అనే భూతాలు మటుమాయమైపోవాలనీ, వివేక, విజ్ఞానాలు వర్ధిల్లాలనీ ఆయన ఈ పీఠిక రాశారు.
"సీతజోస్య౦" పీఠికలో ఆయన చర్చించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు :
1. రామాయణ గాధకున్న చారిత్రిక ఆధారాలేమిటి ?
2. రాముని వనవాసం ఏ ప్రాంతంలో ?
3. రాక్షసులెవరు ? వారి స్థితిగతులేమిటి ?
4. రుషులెవారు ? యజ్ఞ యాగాదుల ప్రాధాన్యత ఎందుకు ?
5. ఆనాటి ఆయుధాలు ఎలాంటివి ?
ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే మరి!
- నార్ల వెంకటేశ్వరరావు
నార్ల వారి పురాణనాటకాల్లో "సీత జోస్యం" రెండవది. పాఠకుల ఆమోదం కాక ఆలోచన కావాలనీ, ప్రశంస కాకుండా జిజ్ఞాస కావాలనీ, పాత విషయాలను కొత్త దృష్టితో చూడాలనీ, పాత విశ్వాసాలకు కొత్త పరీక్షలు పెట్టాలనీ, పాత గాధలకు కొత్త వ్యాఖ్యానాలు చెప్పుకోవాలనీ కోరుతూ నార్లవారు సీతజోస్యానికి పీఠిక రాశారు. జన బాహుళ్యంలో ప్రత్యేకించి మాట విశ్వాసాలను అనుకరిస్తున్న వారిలో స్తబ్దత పోవాలనీ, సంచలనం రావాలనీ, ఉదాసీనం గతించాలనీ, "విస్సన్నల" పట్ల, వారి "వేదాల" పట్ల గౌరవం తగ్గాలనీ ఆయన ఆశించారు. మానసిక పరివర్తన, నవచైతన్యం, పురోగతినే ఆయన లక్షించారు. జాతి, మత, కుల విభేదాలన్నీ సమసిపోవాలనీ, సమతా స్వాతంత్ర్యాలు సర్వత్రా నెలకొనాలనీ, దారిద్ర్యం, దైన్యం అనే భూతాలు మటుమాయమైపోవాలనీ, వివేక, విజ్ఞానాలు వర్ధిల్లాలనీ ఆయన ఈ పీఠిక రాశారు. "సీతజోస్య౦" పీఠికలో ఆయన చర్చించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు : 1. రామాయణ గాధకున్న చారిత్రిక ఆధారాలేమిటి ? 2. రాముని వనవాసం ఏ ప్రాంతంలో ? 3. రాక్షసులెవరు ? వారి స్థితిగతులేమిటి ? 4. రుషులెవారు ? యజ్ఞ యాగాదుల ప్రాధాన్యత ఎందుకు ? 5. ఆనాటి ఆయుధాలు ఎలాంటివి ? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే మరి! - నార్ల వెంకటేశ్వరరావు
© 2017,www.logili.com All Rights Reserved.