స్వాతంత్ర పోరాటం దేశ విమోచనలో ఒక ఘట్టం. అది సాగిన తీరు ప్రపంచ చరిత్రలో అద్వితీయం. ఫ్రెంచి, అమెరికన్, రష్యన్ విప్లవాలకి లేని ప్రత్యేకత దీనికి ఉంది. ఫ్రెంచి విప్లవం స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలతో సాగింది. పరాయిపాలన మీద పోరాటంగా కాదు. బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వలస విముక్తి కోసం అమెరికన్ స్వాతంత్ర పోరాటం సాగింది. సామ్యవాద వ్యవస్థాపన ధ్యేయంగా రష్యన్ విప్లవం జరిగింది.
భారత స్వాతంత్ర పోరాటంలో ఇలా ముందుగానే నిర్దేశించుకున్న లక్ష్యాలు లేవు. పోరాటం సాగుతూ వుండగా లక్ష్యాలు రూపు తీసుకుంటూ వచ్చాయి. కాంగ్రెస్ స్థాపన నుంచి గాంధీ రాక దాకా జరిగిన పోరాటంలో ఈ పార్శ్వం కనిపించింది. బ్రిటిష్ వాళ్ళ బూటకపు ఔదార్యం, శాసనాల లోగుట్టు వెల్లడవుతూ వచ్చేకొద్దీ పోరాటం దిశ మారుతూ వచ్చింది. ఎన్నో ఏళ్ళు స్తబ్ధత ఆవరించుకున్న జాతి జూలు విదిలించుకుని గర్జించే సింహంలా లేచింది. జాతి జాగృతమై తన భవిష్యత్ నీ, ప్రపంచ దిశనీ నిర్దేశి౦చుకోగల సత్తా సంచరించుకుంది.
భారత స్వతంత్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు కమ్ముకున్నాయో!
అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్పూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం.
స్వాతంత్ర పోరాటం దేశ విమోచనలో ఒక ఘట్టం. అది సాగిన తీరు ప్రపంచ చరిత్రలో అద్వితీయం. ఫ్రెంచి, అమెరికన్, రష్యన్ విప్లవాలకి లేని ప్రత్యేకత దీనికి ఉంది. ఫ్రెంచి విప్లవం స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలతో సాగింది. పరాయిపాలన మీద పోరాటంగా కాదు. బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వలస విముక్తి కోసం అమెరికన్ స్వాతంత్ర పోరాటం సాగింది. సామ్యవాద వ్యవస్థాపన ధ్యేయంగా రష్యన్ విప్లవం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటంలో ఇలా ముందుగానే నిర్దేశించుకున్న లక్ష్యాలు లేవు. పోరాటం సాగుతూ వుండగా లక్ష్యాలు రూపు తీసుకుంటూ వచ్చాయి. కాంగ్రెస్ స్థాపన నుంచి గాంధీ రాక దాకా జరిగిన పోరాటంలో ఈ పార్శ్వం కనిపించింది. బ్రిటిష్ వాళ్ళ బూటకపు ఔదార్యం, శాసనాల లోగుట్టు వెల్లడవుతూ వచ్చేకొద్దీ పోరాటం దిశ మారుతూ వచ్చింది. ఎన్నో ఏళ్ళు స్తబ్ధత ఆవరించుకున్న జాతి జూలు విదిలించుకుని గర్జించే సింహంలా లేచింది. జాతి జాగృతమై తన భవిష్యత్ నీ, ప్రపంచ దిశనీ నిర్దేశి౦చుకోగల సత్తా సంచరించుకుంది. భారత స్వతంత్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు కమ్ముకున్నాయో! అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్పూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.