కామేశ్వరీ వ్రత విధానమ్
కామేశ్వరిని కులదైవంగా కొలుచుకునే చిన్న, పెద్ద, బీద,ధనిక బ్రాహ్మణ వంశాలు అనేకం ఈ భారతావని పై ఉన్నాయి. ప్రధానంగా కామేశ్వరిని ఉపనయన,వివాహ, గృహప్రవేశాది సమయాలలో ప్రత్యేక పూజలతో, అర్చనలతో, ప్రతవిధితో కొలవడం వరిపాటి. మన తెలుగునాట ఈ కామేశ్వరిని పెదకామేశ్వరీ,చినకామేశ్వరీ పేర జరుపుకుంటున్నారు. ప్రతవిధానంలో కామేశ్వరీపాట,స్థానకాదులు కానవచ్చేది పెదకామేశ్వరి. వసంత ఋతువులో వైశాఖ మాసంనాడు ఆ ఇంటి ఇల్లాలులు ముత్తైదువును కామేశ్వరిగా
భావించి ఆమెకు పారాణి అలంకరించి, గంధాన్ని పూసి,పూలమాలను ధరింపచేసి వసుపు,కుంకుమ, చీరజాకెట్టు (లేదా) రవిక,కాటుక, అద్దం,లక్కజోళ్ళు, చెక్కకుంకుమబరణి, నల్లపూసలు,దువ్వెన, గాజులు, చలిమిడి, చూతఫలం,పానకం,వడపప్పు తాంబూలం పెట్టి అందిస్తారు. తిరిగి ఆ ముత్తైదువు నుండి ప్రసాదంగా కొద్ది చలిమిడిని,వడపప్పును, పానకాన్ని చీరకొంగుతో యాచించి కుటుంబీకులు ఆ ప్రసాదాన్ని అమృతతుల్యంగా భావించి భుజిస్తారు. దీనినే చినకామేశ్వరి(ముంత చలవ) అని అంటారు.
కామేశ్వరీ వ్రత విధానం ఏమిటి ? అని ఆలోచిస్తే. ఇందు వివిధరకాల పద్ధతులు | ఆచారంలో ఉన్నాయి. కొందరు కామేశ్వరీ దేవిని ఇష్టకామేశ్వరీ అనీ, ఆదిలక్ష్మి కామేశ్వరీ అనీ, సౌభాగ్య కామేశ్వరీ అనీ, ఉయ్యాల కామేశ్వరీ అనీ, కామేశ్వరాంకస్థిత శ్రీకామేశ్వరీ | అనీ కొలవడం జరుగుతుంది. ఏది ఏమైనా "వేదపురాణశాస్త్ర పదవీనద యనియైన పెద్దముత్తైదువ" శ్రీకామేశ్వరీ దేవిని భక్తితో కొల్చేవారి ఇంట ఆమె కొంగుబంగారమై నిలచి సిరిసంపదలను, సుఖశాంతులను ప్రసాదిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. |
కామేశ్వరీ వ్రత కథను బ్రహ్మనారదునికి తెలిపినట్లు, గౌతమ మహర్షి అహల్యకు తెలిపినట్లు దేవీ పురాణంలో ఉంది. సప్తమాతృకలైన కొండవేణి(కొండమ్మ, ముగైంది (ముద్దరాలు),జక్కులాంబ జక్కులమ్మ), ఎరిణాంబ(ఎరిణమ్మ దాదినమ్మ), అని ఖాంబ (అసికమ్మ అనగము, దీర్వేజి(చీరవేణి), పేర్వేణి(పేరవేణి)లు కామేశ్వరికి అక్కలు వీరు వరుసగా బ్రాహ్మీమాహేశ్వరీ, ఇంద్రాణి, కామారీ, చాముండా, వారాహీ వైష్ణనీ యొక్క అంశలు. అష్టమమాతృక అయిన మహాలక్ష్మీ అంశగా కామేశ్వరిని భావిస్తారు. అందుకే కామేశ్వరీ వ్రతంలో 'ఎనమండుగురు' ముత్తైదువులను ఆహ్వానించడం జరుగుతుంది. కొందరు వారి కత్తిననుసరించి 5,7,9,11 మందిని ముత్తైదువులుగా ఆహ్వానిస్తారు. పోతన్న, వీరన్నల స్థానంలో బావమరుదులనుగానీ, బ్రహ్మచారులనుగానీ, బ్రాహ్మణులనుగానీ ఆహ్వానించడం............
కామేశ్వరీ వ్రత విధానమ్ కామేశ్వరిని కులదైవంగా కొలుచుకునే చిన్న, పెద్ద, బీద,ధనిక బ్రాహ్మణ వంశాలు అనేకం ఈ భారతావని పై ఉన్నాయి. ప్రధానంగా కామేశ్వరిని ఉపనయన,వివాహ, గృహప్రవేశాది సమయాలలో ప్రత్యేక పూజలతో, అర్చనలతో, ప్రతవిధితో కొలవడం వరిపాటి. మన తెలుగునాట ఈ కామేశ్వరిని పెదకామేశ్వరీ,చినకామేశ్వరీ పేర జరుపుకుంటున్నారు. ప్రతవిధానంలో కామేశ్వరీపాట,స్థానకాదులు కానవచ్చేది పెదకామేశ్వరి. వసంత ఋతువులో వైశాఖ మాసంనాడు ఆ ఇంటి ఇల్లాలులు ముత్తైదువును కామేశ్వరిగా భావించి ఆమెకు పారాణి అలంకరించి, గంధాన్ని పూసి,పూలమాలను ధరింపచేసి వసుపు,కుంకుమ, చీరజాకెట్టు (లేదా) రవిక,కాటుక, అద్దం,లక్కజోళ్ళు, చెక్కకుంకుమబరణి, నల్లపూసలు,దువ్వెన, గాజులు, చలిమిడి, చూతఫలం,పానకం,వడపప్పు తాంబూలం పెట్టి అందిస్తారు. తిరిగి ఆ ముత్తైదువు నుండి ప్రసాదంగా కొద్ది చలిమిడిని,వడపప్పును, పానకాన్ని చీరకొంగుతో యాచించి కుటుంబీకులు ఆ ప్రసాదాన్ని అమృతతుల్యంగా భావించి భుజిస్తారు. దీనినే చినకామేశ్వరి(ముంత చలవ) అని అంటారు. కామేశ్వరీ వ్రత విధానం ఏమిటి ? అని ఆలోచిస్తే. ఇందు వివిధరకాల పద్ధతులు | ఆచారంలో ఉన్నాయి. కొందరు కామేశ్వరీ దేవిని ఇష్టకామేశ్వరీ అనీ, ఆదిలక్ష్మి కామేశ్వరీ అనీ, సౌభాగ్య కామేశ్వరీ అనీ, ఉయ్యాల కామేశ్వరీ అనీ, కామేశ్వరాంకస్థిత శ్రీకామేశ్వరీ | అనీ కొలవడం జరుగుతుంది. ఏది ఏమైనా "వేదపురాణశాస్త్ర పదవీనద యనియైన పెద్దముత్తైదువ" శ్రీకామేశ్వరీ దేవిని భక్తితో కొల్చేవారి ఇంట ఆమె కొంగుబంగారమై నిలచి సిరిసంపదలను, సుఖశాంతులను ప్రసాదిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. | కామేశ్వరీ వ్రత కథను బ్రహ్మనారదునికి తెలిపినట్లు, గౌతమ మహర్షి అహల్యకు తెలిపినట్లు దేవీ పురాణంలో ఉంది. సప్తమాతృకలైన కొండవేణి(కొండమ్మ, ముగైంది (ముద్దరాలు),జక్కులాంబ జక్కులమ్మ), ఎరిణాంబ(ఎరిణమ్మ దాదినమ్మ), అని ఖాంబ (అసికమ్మ అనగము, దీర్వేజి(చీరవేణి), పేర్వేణి(పేరవేణి)లు కామేశ్వరికి అక్కలు వీరు వరుసగా బ్రాహ్మీమాహేశ్వరీ, ఇంద్రాణి, కామారీ, చాముండా, వారాహీ వైష్ణనీ యొక్క అంశలు. అష్టమమాతృక అయిన మహాలక్ష్మీ అంశగా కామేశ్వరిని భావిస్తారు. అందుకే కామేశ్వరీ వ్రతంలో 'ఎనమండుగురు' ముత్తైదువులను ఆహ్వానించడం జరుగుతుంది. కొందరు వారి కత్తిననుసరించి 5,7,9,11 మందిని ముత్తైదువులుగా ఆహ్వానిస్తారు. పోతన్న, వీరన్నల స్థానంలో బావమరుదులనుగానీ, బ్రహ్మచారులనుగానీ, బ్రాహ్మణులనుగానీ ఆహ్వానించడం............© 2017,www.logili.com All Rights Reserved.