(విన్నపము)
మన భారతదేశము సమస్త విద్యలకు పుట్టినిల్లు. భారతీయ విజ్ఞానము మహోజ్వలముగా ప్రకాశించి ప్రపంచ దేశముల మన్ననలందుకొన్నది. అతీంద్రియ శక్తిగల మన భారతీయ ప్రాచీన మహర్పులు - మహామేధావులగు పండితులు - శాస్త్రవేత్తలు అట్టి విజ్ఞాన సంపదను సంస్కృత భాషయందు సమకూర్చి, లోకకళ్యాణము నాకాక్షించి మనకు అందజేసియున్నారు. అట్టి మహానుభావులందరకు నమస్సుమాంజలులు.
పూర్వులందజేసిన శాస్త్రములలో జ్యోతిష - వాస్తుశాస్త్రములు విశేషముగా ప్రజాదరణ పొందుచున్నవి. అందును వాస్తుశాస్త్రము ప్రస్తుతమున ఆంధ్రదేశమున బహుళ ప్రచారము నొంది, అతి సామాన్యుని చేతను ఆదరింపబడుచున్నది. సంస్కృత మూలమగు శాస్త్రీయ వాస్తు గ్రంథములు ఆంధ్రప్రజానీకమునకు అందుబాటులోనికి వచ్చి యుండలేదు. సంస్కృతమూల గ్రంథముల నుండి కొన్ని అంశములను మాత్రము గ్రహించి తెలుగులో కొందరు పండితులు వాస్తు గ్రంథములను రచించిరి. కాని అవియు సంపూర్ణముగా విషయ సమగ్రత కలిగియుండకున్నవి. కావున వాస్తు శాస్త్రమును సంపూర్ణముగా అధ్యయనము జేయ వీలుగాకున్నది.
ఇట్టి స్థితిలో శ్రీ ముద్రగెడ రామారావు మొదలగు ఆధునికులు, వాస్తు విషయములను తమ అనుభవము పరిశీలన ఆధారముగా, తమ వూహకందిన స్వతంత్ర అభిప్రాయములను ఏర్చి కూర్చి, పూర్వశాస్త్ర సమ్మతితో నిస్తు గ్రంథములు తెలుగులో తగినన్ని అందుబాటులో లేనందున, స్వతంత్ర అభిప్రాయములతో కూడిన అశాస్త్రీయ వాస్తు గ్రంథములు జన సామాన్యంలో బహుళ ప్రచారము నొంది, శాస్త్రీయములుగా చెలామణి యగుచున్నవి.మిత్తములేకయే, తెలుగులో వాస్తు గ్రంథములను 1954 ప్రాంతము నుండి ప్రకటించుట జరుగుచున్నది. ఈ అనుభవ వాస్తు ప్రచారము కనీసము రెండు దశాబ్దముల నుండి క్రమముగా విస్తృతమై, స్వతంత్ర అభిప్రాయములతో గూడిన వాస్తు గ్రంథములు విరివిగా తెలుగులో ప్రచురింపబడుచున్నవి........
(విన్నపము) మన భారతదేశము సమస్త విద్యలకు పుట్టినిల్లు. భారతీయ విజ్ఞానము మహోజ్వలముగా ప్రకాశించి ప్రపంచ దేశముల మన్ననలందుకొన్నది. అతీంద్రియ శక్తిగల మన భారతీయ ప్రాచీన మహర్పులు - మహామేధావులగు పండితులు - శాస్త్రవేత్తలు అట్టి విజ్ఞాన సంపదను సంస్కృత భాషయందు సమకూర్చి, లోకకళ్యాణము నాకాక్షించి మనకు అందజేసియున్నారు. అట్టి మహానుభావులందరకు నమస్సుమాంజలులు. పూర్వులందజేసిన శాస్త్రములలో జ్యోతిష - వాస్తుశాస్త్రములు విశేషముగా ప్రజాదరణ పొందుచున్నవి. అందును వాస్తుశాస్త్రము ప్రస్తుతమున ఆంధ్రదేశమున బహుళ ప్రచారము నొంది, అతి సామాన్యుని చేతను ఆదరింపబడుచున్నది. సంస్కృత మూలమగు శాస్త్రీయ వాస్తు గ్రంథములు ఆంధ్రప్రజానీకమునకు అందుబాటులోనికి వచ్చి యుండలేదు. సంస్కృతమూల గ్రంథముల నుండి కొన్ని అంశములను మాత్రము గ్రహించి తెలుగులో కొందరు పండితులు వాస్తు గ్రంథములను రచించిరి. కాని అవియు సంపూర్ణముగా విషయ సమగ్రత కలిగియుండకున్నవి. కావున వాస్తు శాస్త్రమును సంపూర్ణముగా అధ్యయనము జేయ వీలుగాకున్నది. ఇట్టి స్థితిలో శ్రీ ముద్రగెడ రామారావు మొదలగు ఆధునికులు, వాస్తు విషయములను తమ అనుభవము పరిశీలన ఆధారముగా, తమ వూహకందిన స్వతంత్ర అభిప్రాయములను ఏర్చి కూర్చి, పూర్వశాస్త్ర సమ్మతితో నిస్తు గ్రంథములు తెలుగులో తగినన్ని అందుబాటులో లేనందున, స్వతంత్ర అభిప్రాయములతో కూడిన అశాస్త్రీయ వాస్తు గ్రంథములు జన సామాన్యంలో బహుళ ప్రచారము నొంది, శాస్త్రీయములుగా చెలామణి యగుచున్నవి.మిత్తములేకయే, తెలుగులో వాస్తు గ్రంథములను 1954 ప్రాంతము నుండి ప్రకటించుట జరుగుచున్నది. ఈ అనుభవ వాస్తు ప్రచారము కనీసము రెండు దశాబ్దముల నుండి క్రమముగా విస్తృతమై, స్వతంత్ర అభిప్రాయములతో గూడిన వాస్తు గ్రంథములు విరివిగా తెలుగులో ప్రచురింపబడుచున్నవి........© 2017,www.logili.com All Rights Reserved.