ఇదొక ప్రేమావరణం
“అత్యాశక్తి స్వరూపాయాం
పరమాహ్లాదకారిణీం
సమాక్లిష్టం ఉభోరూపం
రాధాకృష్ణం నమామ్యహం”
అసలీ సృష్టి యావత్తూ ప్రేమస్వరూపం. ఒక జీవి పుట్టుకనుంచి నిష్క్రమణం వరకు అన్నీ ప్రేమలో భాగమే. ప్రకృతిలోని ప్రతి అణువూ ప్రేమస్వరూపమే. చరాచరజగత్తులోని ప్రతి అంశానికి ఒక రూపమిచ్చి గౌరవించే, పూజించే భారతీయ ఆధ్యాత్మిక విశ్వంలో ప్రేమకు పర్యాయరూపాలుగా నిలిచిన ఏకైక జంట రాధాకృష్ణులు. ఎవరివల్ల ప్రేమ ఆదర్శమైందో, ప్రపంచానికి ఆధారమైందో, రెండు ప్రాణుల మధ్య బంధం ప్రేమగా గుర్తించబడిందో, కంటికి కనిపించని విడలేనితనం జీవులమధ్య స్థిరపడిందో ఆ బాంధవ్యస్థితికి జంగమమైన రూపాన్నిస్తే వారే రాధాకృష్ణులు. అయితే నేనిక్కడ ఏ రూపం ఎప్పుడొచ్చిందీ? ఎవరి సృష్టి? ఎందుకోసం లాంటి వివరాలు చెప్పబోవటం లేదు. ఏ భావనైతే అందరికీ అనుభవైక వేద్యమయ్యు వ్యక్తీకరణ కందకుండా దాగి ఉంటుందో, ఆ భావనలోని ఆంతర్యాన్ని నా అక్షరాల కందినంతవరకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను.
రాధాకృష్ణులు గోలోకంనుంచి భూలోకంలో ఉద్భవించిన ప్రేమమూర్తులుగా శ్రీకృష్ణజన్మఖండం చెబుతుంది. సంపూర్ణావతారమూర్తి అయిన వాసుదేవుడు..................
ఇదొక ప్రేమావరణం “అత్యాశక్తి స్వరూపాయాం పరమాహ్లాదకారిణీం సమాక్లిష్టం ఉభోరూపం రాధాకృష్ణం నమామ్యహం” అసలీ సృష్టి యావత్తూ ప్రేమస్వరూపం. ఒక జీవి పుట్టుకనుంచి నిష్క్రమణం వరకు అన్నీ ప్రేమలో భాగమే. ప్రకృతిలోని ప్రతి అణువూ ప్రేమస్వరూపమే. చరాచరజగత్తులోని ప్రతి అంశానికి ఒక రూపమిచ్చి గౌరవించే, పూజించే భారతీయ ఆధ్యాత్మిక విశ్వంలో ప్రేమకు పర్యాయరూపాలుగా నిలిచిన ఏకైక జంట రాధాకృష్ణులు. ఎవరివల్ల ప్రేమ ఆదర్శమైందో, ప్రపంచానికి ఆధారమైందో, రెండు ప్రాణుల మధ్య బంధం ప్రేమగా గుర్తించబడిందో, కంటికి కనిపించని విడలేనితనం జీవులమధ్య స్థిరపడిందో ఆ బాంధవ్యస్థితికి జంగమమైన రూపాన్నిస్తే వారే రాధాకృష్ణులు. అయితే నేనిక్కడ ఏ రూపం ఎప్పుడొచ్చిందీ? ఎవరి సృష్టి? ఎందుకోసం లాంటి వివరాలు చెప్పబోవటం లేదు. ఏ భావనైతే అందరికీ అనుభవైక వేద్యమయ్యు వ్యక్తీకరణ కందకుండా దాగి ఉంటుందో, ఆ భావనలోని ఆంతర్యాన్ని నా అక్షరాల కందినంతవరకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. రాధాకృష్ణులు గోలోకంనుంచి భూలోకంలో ఉద్భవించిన ప్రేమమూర్తులుగా శ్రీకృష్ణజన్మఖండం చెబుతుంది. సంపూర్ణావతారమూర్తి అయిన వాసుదేవుడు..................© 2017,www.logili.com All Rights Reserved.