ప్రథమ స్కంధం
సత్రయాగంలో సూత మహాముని
పవిత్రమైన నైమిశారణ్యంలో సత్రయాగం జరుగుతోంది. వెయ్యేళ్ళపాటు కొనసాగే సుదీర్ఘ యజ్ఞం అది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం శౌనకుడు మొదలైన మహర్షులు అక్కడ సత్రయాగాన్ని చేస్తున్నారు.
ఆ సందర్భంగా ఆ వైష్ణవ క్షేత్రానికి సకల పురాణవేత్త అయిన సూత మహాముని వచ్చాడు. ఆయనకి మునులందరూ సాదరంగా అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టారు. తర్వాత ఆ మహాత్మునికి ఎదురుగా శౌనకాది మునులందరూ కూర్చున్నారు.
"మహామునీ ! వ్యాసమహర్షి రచించిన పురాణాల్ని నీ తండ్రి రోమహర్షణుని ద్వారా తెలుసుకొని, వినేవారికి ఆనందం కలిగించేలా చెప్పగల నేర్పు నువ్వు సాధించావు.
కలియుగంలోని పాపాలన్నింటినీ తొలగించి మోక్షాన్ని ఇచ్చే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ప్రతిక్షణం ఆయననే కీర్తించి తరించిన పరమభక్తుల గాథల్ని, ఆ నారాయణుని అవతార విశేషాల్ని నువ్వు చెబితే వినాలని మాకెంతో కుతూహలంగా ఉంది" అని మునులు............
ప్రథమ స్కంధంసత్రయాగంలో సూత మహామునిపవిత్రమైన నైమిశారణ్యంలో సత్రయాగం జరుగుతోంది. వెయ్యేళ్ళపాటు కొనసాగే సుదీర్ఘ యజ్ఞం అది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం శౌనకుడు మొదలైన మహర్షులు అక్కడ సత్రయాగాన్ని చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆ వైష్ణవ క్షేత్రానికి సకల పురాణవేత్త అయిన సూత మహాముని వచ్చాడు. ఆయనకి మునులందరూ సాదరంగా అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టారు. తర్వాత ఆ మహాత్మునికి ఎదురుగా శౌనకాది మునులందరూ కూర్చున్నారు. "మహామునీ ! వ్యాసమహర్షి రచించిన పురాణాల్ని నీ తండ్రి రోమహర్షణుని ద్వారా తెలుసుకొని, వినేవారికి ఆనందం కలిగించేలా చెప్పగల నేర్పు నువ్వు సాధించావు. కలియుగంలోని పాపాలన్నింటినీ తొలగించి మోక్షాన్ని ఇచ్చే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ప్రతిక్షణం ఆయననే కీర్తించి తరించిన పరమభక్తుల గాథల్ని, ఆ నారాయణుని అవతార విశేషాల్ని నువ్వు చెబితే వినాలని మాకెంతో కుతూహలంగా ఉంది" అని మునులు............© 2017,www.logili.com All Rights Reserved.