మార్కండేయ మహర్షి మనకు చాలా పురాణములలో దర్శనమిస్తారు. మార్కండేయులవారు విష్ణుమాయను దర్శించిన మహనీయుడు. ఆయనను గూర్చి చాలా కథలున్నవి. ఒకసారి ఆయన శివుని గూర్చి తపమాచరించుచుండగా శివుడు ఆయనకు ప్రత్యక్షమై అతడిని చిరంజీవి కమ్మని దీవించెనని ఒక కథ. మార్కండేయుడుని బ్రహ్మచారి అంటారు ఒకచోట. ఈ పురాణాలలో చెప్పే బ్రహ్మచర్యము, సామాన్యులకు అర్ధము కాదు. ఎందుకంటే 16108 మంది భార్యలు ఉన్న శ్రీకృష్ణపరమాత్మను బ్రహ్మచారిగా చెబుతారు. అది మనకు తెలియదని తెలుసుకుని పెద్దవారి నుండి తెలుసుకోవాలే గాని విమర్శించకూడదు. మార్కండేయుని భార్య ధూమ్రావతి అని వేదశిరుడు వారి కుమారుడని చెబుతారు.
ఇంతవరకూ మార్కండేయ పురాణంలో చెప్పబడని మార్కండేయ మహర్షి జన్మవృత్తాంతములను ఈ గ్రంథంలో చెప్పుకుంటాము. ఇంకా మార్కండేయ మహాపురాణములోని ఐదు భాగాలను ఈ వచనగ్రంథంలో వివరించడం జరిగింది.
- నో.హ.శాస్త్రి
మార్కండేయ మహర్షి మనకు చాలా పురాణములలో దర్శనమిస్తారు. మార్కండేయులవారు విష్ణుమాయను దర్శించిన మహనీయుడు. ఆయనను గూర్చి చాలా కథలున్నవి. ఒకసారి ఆయన శివుని గూర్చి తపమాచరించుచుండగా శివుడు ఆయనకు ప్రత్యక్షమై అతడిని చిరంజీవి కమ్మని దీవించెనని ఒక కథ. మార్కండేయుడుని బ్రహ్మచారి అంటారు ఒకచోట. ఈ పురాణాలలో చెప్పే బ్రహ్మచర్యము, సామాన్యులకు అర్ధము కాదు. ఎందుకంటే 16108 మంది భార్యలు ఉన్న శ్రీకృష్ణపరమాత్మను బ్రహ్మచారిగా చెబుతారు. అది మనకు తెలియదని తెలుసుకుని పెద్దవారి నుండి తెలుసుకోవాలే గాని విమర్శించకూడదు. మార్కండేయుని భార్య ధూమ్రావతి అని వేదశిరుడు వారి కుమారుడని చెబుతారు. ఇంతవరకూ మార్కండేయ పురాణంలో చెప్పబడని మార్కండేయ మహర్షి జన్మవృత్తాంతములను ఈ గ్రంథంలో చెప్పుకుంటాము. ఇంకా మార్కండేయ మహాపురాణములోని ఐదు భాగాలను ఈ వచనగ్రంథంలో వివరించడం జరిగింది. - నో.హ.శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.