"పురాపి నవం పురాణం" అనగా జరిగిన పెక్కు కాల్పముల చరిత్రను తెలుపుచున్నదైనను క్రొత్తగా నండునది పురాణమని నిర్వచనము. కానీ పురాణవం అని లేదు కావున ఈ నిర్వచనము తప్పు. అమరకోశము నందు "పురా పూర్వస్మిన్ భూతమితి పురాణం" పూర్వమునకు సంబంధించినది పురాణమని చెప్పబడినది. అట్లే "పురా భావతీతి పురాణం " పూర్వమందు పుట్టినది కనుక పురాణము అని కూడా చెప్పబడినది. బమ్మెర పోతనామాత్యుడు రుక్మిణి కల్యాణంలో "నమ్మితి నా మనమ్మున సనాతనులైన యుమా మహేశులన్ మిమ్ముఁబ్రురాణ దంపతుల" అని అది దంపతులయిన శివ పార్వతులను పురాణాదంపతులు అని పేర్కొన్నాడు. అందువలన పురాణము అంటే పూర్వకాలమునకు సంబంధించినది అను అర్ధమే సరియైనది.