నామ రామాయణము శ్రీ చింతా రామకృష్ణారావు కవి, ప్రవచకులు. షాట్నం . 508, శ్రీరత్నవిహార, బనా బాడీ బిల్డింగ్ యూనిట్ ప్రక్కన,
నాగార్జున ఎన్ క్లేవ్ రోడ్డు, మియాపూర్, ఇందు హైదరాబాద్-500049
తొలిపలుకులు జైశ్రీరామ్.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా రాంపురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్.
శ్రీ చెరువు హరిశ్రీపినాకపాణిశర్మ గారు "లలితా, విష్ణు సహస్రనామ నందాన్వయ అర్థ దీపిక” రచించి ప్రసిద్ధినందిన మహనీయులు.
శ్రీ లక్ష్మణాచార్య విరచిత సంస్కృత అష్టోత్తరశత రామ నామాలలో వాల్మీకి రామాయణము అంతయు సూచితమయియున్నది. ఈ విషయమే గ్రహించి | వీరు శ్రీ నామ రామాయణము (వాల్మీకీయ దర్శనం) పేర చక్కగా | సోదాహరణముగా వివరించియున్నారు. ఈ రోజులలో మనకు వాల్మీకి రామాయణమును కాని మరే రామాయణము గాని పఠించుటకు తగిన సమయము సన్నగిల్లుచున్నందున ఇటువంటి సులభ శైలిలో లభ్యమగు వాటిని పఠించుట జరుగుచున్నదని గ్రహించిన మన శర్మగారు ఈ 'నామ రామాయణమున' వాల్మీకి
రామాయణము' మొత్తము ఏవిధముగా నిబిడీకృతమై యున్నదో వివరించు ప్రయత్నమును చక్కగా చేసియున్నారు. మొదటి ఆరు పుటలలో శ్రీ లక్ష్మణాచార్య విరచిత శ్రీ నామ రామాయణము సంస్కృత రామ నామాలు మొత్తం 108 మూలమును వ్రాసి యున్నారు. తదుపరి దీని ప్రాశస్త్యమును తెలిపి అక్కడ నుండి ఒక్కొక్కటిగా గల రామ నామములను వివరించియున్నారు.
శ్రీమద్రామాయణములో ఉన్న అనేక విశేషాంశములను ఈ నామ రామాయణమున గల అంశములను స్పృశించి, వాల్మీకి రామాయణముతో అనుసంధానము చేసి వివరించుట మూలమున పాఠకులకు సుబోధకమగునట్లు.......
నామ రామాయణము శ్రీ చింతా రామకృష్ణారావు కవి, ప్రవచకులు. షాట్నం . 508, శ్రీరత్నవిహార, బనా బాడీ బిల్డింగ్ యూనిట్ ప్రక్కన, నాగార్జున ఎన్ క్లేవ్ రోడ్డు, మియాపూర్, ఇందు హైదరాబాద్-500049 తొలిపలుకులు జైశ్రీరామ్. దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా రాంపురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్. శ్రీ చెరువు హరిశ్రీపినాకపాణిశర్మ గారు "లలితా, విష్ణు సహస్రనామ నందాన్వయ అర్థ దీపిక” రచించి ప్రసిద్ధినందిన మహనీయులు. శ్రీ లక్ష్మణాచార్య విరచిత సంస్కృత అష్టోత్తరశత రామ నామాలలో వాల్మీకి రామాయణము అంతయు సూచితమయియున్నది. ఈ విషయమే గ్రహించి | వీరు శ్రీ నామ రామాయణము (వాల్మీకీయ దర్శనం) పేర చక్కగా | సోదాహరణముగా వివరించియున్నారు. ఈ రోజులలో మనకు వాల్మీకి రామాయణమును కాని మరే రామాయణము గాని పఠించుటకు తగిన సమయము సన్నగిల్లుచున్నందున ఇటువంటి సులభ శైలిలో లభ్యమగు వాటిని పఠించుట జరుగుచున్నదని గ్రహించిన మన శర్మగారు ఈ 'నామ రామాయణమున' వాల్మీకి రామాయణము' మొత్తము ఏవిధముగా నిబిడీకృతమై యున్నదో వివరించు ప్రయత్నమును చక్కగా చేసియున్నారు. మొదటి ఆరు పుటలలో శ్రీ లక్ష్మణాచార్య విరచిత శ్రీ నామ రామాయణము సంస్కృత రామ నామాలు మొత్తం 108 మూలమును వ్రాసి యున్నారు. తదుపరి దీని ప్రాశస్త్యమును తెలిపి అక్కడ నుండి ఒక్కొక్కటిగా గల రామ నామములను వివరించియున్నారు. శ్రీమద్రామాయణములో ఉన్న అనేక విశేషాంశములను ఈ నామ రామాయణమున గల అంశములను స్పృశించి, వాల్మీకి రామాయణముతో అనుసంధానము చేసి వివరించుట మూలమున పాఠకులకు సుబోధకమగునట్లు.......© 2017,www.logili.com All Rights Reserved.