పదిపదారేళ్ళ అలరాచ పడుచువారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు. సుగంధభరితంగా చల్లని గాలి వీస్తోంది. రాముని ముంగురులు విశాలమైన నుదుటి పై కదలాడుతున్నాయి. విశ్వామిత్రుడు గర్వంగా అడుగులు వేస్తున్నాడు. అశ్వనీ దేవతలవలె రామలక్ష్మణులు అనుసరిస్తున్నా, వారిని వెంటబెట్టుకొని పోవడం పుణ్యఫలం అని విశ్వామిత్రుడు మురిసిపోయాడు. ముగ్గురూ సరయూ నదీతీరం చేరి, ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. విశ్వామిత్రుడు రాముడికి మేల్కొలుపులు పలికాడు. అతిబల, మహాబల అనే విద్యలను రాకుమారులకు ధారపోశాడు. "ఒకప్పుడు జనావాసంగా పచ్చపచ్చగా వున్న ఈ ప్రాంతమంతా నిర్జనంగా మారడానికి - తాటక అనే యక్షిణి కారణం. మారీచుడు యీ యక్షిణి కుమారుడు...."అని చెబుతూ వుండగానే, నరవాసనకు తాటక రానే వచ్చింది. విశ్వామిత్రుని ఆధ్వర్యంలో తాటక సంహారం చేశాడు రాముడు. తరువాత దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విఘ్నచక్ర లాంటి అనేక శక్తిసంపన్నమైన అస్త్రాలను ఉపదేశించాడు ముని. విశ్వామిత్రుని సంకల్ప సారథ్యాలలో సిద్ధాశ్రమంలో యాగాన్ని తలపెట్టారు.
- శ్రీ రమణ