విద్యల వెన్నెల - శ్రీ రాజశ్యామల
"అవబోధన" అనే అర్థంలో "జ్ఞా" అనే ధాతువు ఉంది. దానినుండి "జ్ఞానమ్" అనే రూపం ఏర్పడింది. 'జ్ఞా' అనగా నేర్చుకోవడం, తెలిసికొని ఉండడం అని అర్థములు. "మోక్షే ధీః జ్ఞానమ్" అని అమరము. "మోక్షసాధనమైన బుద్ధికి జ్ఞానము" అని పేరు. బుద్ధి వల్ల మోక్షం వస్తుంది. మానవునకు మోక్ష సంబంధమైన జ్ఞానమే హితము. ఈ జ్ఞానశక్తికి ప్రతీక రాజశ్యామలాదేవి. ఈ తల్లిని ఆరాధిస్తే ఇహపరాలు రెండూ లభ్యాలు. మానవ జీవితము ధన్యము గావించే బ్రతుకు తెరువు విద్యను, జన్మరాహిత్యమొనరించు విద్యను కూడా అమ్మ ప్రసాదిస్తుంది. మానవ జీవితమును ఆనందమయం చేస్తుంది. "ఆనందో బ్రహ్మ" అని బ్రహ్మసాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది. "జ్ఞానాదేవ హి కైవల్యమ్, ఈశ్వరానుగ్రహాదేవ పుంసామ్ అద్వైత వాసనా" అని "దేహమే నేను" అనే బంధాల వలలోనుండి "నేను ఆత్మస్వరూపుడను" అని ఆ మాత జ్ఞానము అనుభవములోనికి తెచ్చి, బయటపడవేస్తుంది.
మనుగడకు కావలసిన లలితకళా పారంగతులను చేస్తుంది. మానవుడు ఏ విద్యను ఆరంభించినా, వాటి అన్నింటిలో సర్వవిద్యాపారంగతులను చేస్తుంది. అటు సాంకేతిక విద్యలను, సర్వకళలను కరతలామలకము గావిస్తుంది. సర్వోన్నత స్థితికి చేరుస్తుంది...................
© 2017,www.logili.com All Rights Reserved.