అమ్మే జన్మకు కారణ
జననీ శతకము
మమ్మే తొలి పలుకులు మనసారా నేర్పున్
నెమ్మది సుళువులు చెప్పును
సుమ్మా తొలిగురువనదగు సూత్రము జననీ
తనకోసం దాచదెపుడు
తన యాకలి బాధనెపుడు తలచంగదుగా
తన బాధ బయటపెట్టదు.
తనవారే సర్వమనుచు తలచును జననీ
అమ్మను పిలుపున యేదో
కమ్మని రుచి కరుణతోడ కలిపిరి ఎవరో
చెమ్మై మది పులకించగ
నమ్మకముగ శాంతమిచ్చు నామము జననీ
ఆమెను పిలువగ నెన్నో
నామములవి కదలుచుండు నా మదిలోనన్
యేమని పిలిచిన పలుకుచు
ప్రేమను పంచుట యెరిగిన పెన్నిధి జననీ
చలి యెంత చేవ జూపిన
తొలిగా మేల్కొను సరగున తూరుపుతోడన్
పలు పనులను చేయుటయం
దలుపెన్నక చక్కబెట్టు తానే జననీ
అమ్మే జన్మకు కారణ జననీ శతకము మమ్మే తొలి పలుకులు మనసారా నేర్పున్ నెమ్మది సుళువులు చెప్పును సుమ్మా తొలిగురువనదగు సూత్రము జననీ తనకోసం దాచదెపుడు తన యాకలి బాధనెపుడు తలచంగదుగా తన బాధ బయటపెట్టదు. తనవారే సర్వమనుచు తలచును జననీ అమ్మను పిలుపున యేదో కమ్మని రుచి కరుణతోడ కలిపిరి ఎవరో చెమ్మై మది పులకించగ నమ్మకముగ శాంతమిచ్చు నామము జననీ ఆమెను పిలువగ నెన్నో నామములవి కదలుచుండు నా మదిలోనన్ యేమని పిలిచిన పలుకుచు ప్రేమను పంచుట యెరిగిన పెన్నిధి జననీ చలి యెంత చేవ జూపిన తొలిగా మేల్కొను సరగున తూరుపుతోడన్ పలు పనులను చేయుటయం దలుపెన్నక చక్కబెట్టు తానే జననీ© 2017,www.logili.com All Rights Reserved.