శ్రీమదాంధ్రమహాభారతము
కవిత్రయం గురించి నాలుగు మాటలు
శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే
(రొమ్ములో, ముఖంలో, దేహంలో వరుసగా లక్ష్మీ, సరస్వతి, పార్వతులను ధరిస్తున్నారు విష్ణు, బ్రహ్మ, శంకరులు. స్త్రీ, పురుష కలయిక వల్ల పుట్టిన లోకాలను కాపాడుతూ నడిపిస్తున్నారు. దేవతలచే పూజింపబడుతున్నారు. అట్టి విష్ణు, బ్రహ్మ, శంకరులు మీకు శుభాలను కలిగించెదరు గాక !)
ఇది శ్రీ మదాంధ్ర మహాభారతంలో మొట్టమొదటి శ్లోకం. తెలుగు కవిత్వానికి శ్రీకారం చుట్టి ఆదికవి, వాగనుశాసనుడు అనే బిరుదుల్ని పొందిన నన్నయ భట్టారకుడి కలం నుండి జాలువారిన రచన. అది సంస్కృతంలో ఉంది.
ఇది ఆనాటి తెలుగు భాషాసాహిత్యాలపై ఉన్న సంస్కృత భాషా ప్రభావాన్ని తెలియ జేస్తుంది. 'రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజతేజో జయశాలి శౌర్యుడు' (ఆం.భా. అవతారిక) అంటూ సాగిన ఈ పద్యమే నన్నయ రాసిన మొట్టమొదటి తెలుగు పద్యం.
ఈ పద్యంతో ప్రారంభించి నన్నయ కవితా ప్రస్థానం కావించాడు. సోదరభాషలతో ఏ భాషకూ లేనంత సాహితీభాండాగారం, విశిష్ట పదసంపద, వైవిధ్యం, వైలక్షణ్యం, వైదగ్ధ్యం కలది తెలుగుభాష. ఇలా తెలుగు వెలుగై వెలగడానికి, వెల్లివిరియడానికి తెరకట్టి నాందీ ప్రస్థావన చేసినవాడు ఆదికవి నన్నయే..............
శ్రీమదాంధ్రమహాభారతము కవిత్రయం గురించి నాలుగు మాటలు శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే (రొమ్ములో, ముఖంలో, దేహంలో వరుసగా లక్ష్మీ, సరస్వతి, పార్వతులను ధరిస్తున్నారు విష్ణు, బ్రహ్మ, శంకరులు. స్త్రీ, పురుష కలయిక వల్ల పుట్టిన లోకాలను కాపాడుతూ నడిపిస్తున్నారు. దేవతలచే పూజింపబడుతున్నారు. అట్టి విష్ణు, బ్రహ్మ, శంకరులు మీకు శుభాలను కలిగించెదరు గాక !) ఇది శ్రీ మదాంధ్ర మహాభారతంలో మొట్టమొదటి శ్లోకం. తెలుగు కవిత్వానికి శ్రీకారం చుట్టి ఆదికవి, వాగనుశాసనుడు అనే బిరుదుల్ని పొందిన నన్నయ భట్టారకుడి కలం నుండి జాలువారిన రచన. అది సంస్కృతంలో ఉంది. ఇది ఆనాటి తెలుగు భాషాసాహిత్యాలపై ఉన్న సంస్కృత భాషా ప్రభావాన్ని తెలియ జేస్తుంది. 'రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజతేజో జయశాలి శౌర్యుడు' (ఆం.భా. అవతారిక) అంటూ సాగిన ఈ పద్యమే నన్నయ రాసిన మొట్టమొదటి తెలుగు పద్యం. ఈ పద్యంతో ప్రారంభించి నన్నయ కవితా ప్రస్థానం కావించాడు. సోదరభాషలతో ఏ భాషకూ లేనంత సాహితీభాండాగారం, విశిష్ట పదసంపద, వైవిధ్యం, వైలక్షణ్యం, వైదగ్ధ్యం కలది తెలుగుభాష. ఇలా తెలుగు వెలుగై వెలగడానికి, వెల్లివిరియడానికి తెరకట్టి నాందీ ప్రస్థావన చేసినవాడు ఆదికవి నన్నయే..............© 2017,www.logili.com All Rights Reserved.