తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. చారిత్రక , పౌరాణికాది అనేక నేపధ్యాలు బాగా తెలిస్తే కానీ సంపూర్ణంగా అర్ధం కానీ శతకం. పైగా రాసిన కవి సామాన్యుడు కాదు. చతుర్విధ కవిత్వాలు నేర్చి, రాజాస్థానాలలో ఎలాంటివారినైనా మెప్పించగలిగిన , ప్రౌఢ మర్మగర్భోక్తులతో కవిత్వం అల్లడంలో ఆరితేరిన బట్టుకవి .
దీనికి తోడు ఈ శతకానికి ఒక చారిత్రక "ఆవశ్యకతాపురాణం " కూడా ఉంది. ఈ కవిగారి శ్రీకాకుళక్షేత్రంలో పూజాదికార్యక్రమాలు సరిగా జరగడం లేదట. అందువల్ల దేవుడు - ఉత్సవాలు లేక వెలవెలపోతున్నాడని కవిగారి మనసు కలత చెందింది . ఆ భాదను ఎవరిముందు వెళ్ళగక్కితే ఎవరు ఊరుకుంటారు గనక! అందుకే "ఆ తిట్టేదేదో ఆయన్నే సున్నితంగా తిడదాం !" అని ప్రారంభించాడు. అందుకు వ్యాజస్తుతి అలంకారం బాగా అక్కరకు వచ్చింది.