భాగవత ప్రాభృతకం
దివ్యసూరులుగా కీర్తింపబడే ఆర్వార్లు అనుగ్రహించిన దివ్యప్రబంధాలలో ఆర్డర్ అనుగ్రహించిన "తిరుప్పావై" దివ్యప్రబంధం ప్రత్యేకమైన స్థానాన్ని అలంకరిస్తున్నది. శ్రీవైష్ణవాలయాలలోనే కాక, ప్రతి వైష్ణవ గృహాలలో కూడా ఈ
అనుసంధింపబడకుండా నిత్యారాధన జరుగదు. ఈ ప్రబంధవైలక్షణ్యాన్ని గూర్చి తెలియజేయడానికి ఈ ఒక్క విషయమే చాలు "అజ్ఞుకుడిక్కు ఒరు శన్తతియాయ్, ఆఖ్వారకర్తమ్ శెయలై విశనిల్కుమ్ తన్మైయళాయ్ పిజ్జాయ్ పుత్తాలై అద్దాలై" (మంగళాశాసనం చేసే దివ్యసూరుల కులానికి ఏకైక పుత్రికయై. ఆ ఆథ్వార్ల భక్తికి మించిన భక్తిని కల్గినదై, చిన్నవయస్సులోనే పరిణతిని పొందిన ఆణ్ణాల్ను) అని శ్రీమణవాళ మహామునులు ఉపదేశరత్తనమాలై ప్రబంధంలో అనుగ్రహించిన శ్రీసూక్తి గోదాదేవి యొక్క జ్ఞానభక్తుల వైలక్షణ్యాన్ని తెల్పుతున్నది. దివ్యసూరులు "ఆఖ్వార్లు" (అవగాహిస్తున్నవారు- ఇంకా భగవదనుభవ పర్యంతసీమను పూర్తిగా దర్శించనివారు) కాగా, ఈమె "ఆల్" (ఆన్డాళ్) (భగవదనుభవాన్ని పూర్ణంగా అవగాహించినది) అనే శబ్దచమత్కృతి పూర్వకమైన వివరణాన్ని కూడా పెద్దలు తెల్పుతారు. ఇది "ఏకదేశవికృత మనన్యవద్భవతి" అనే న్యాయాన్ని పురస్కరించుకొని "న హి నిందా" న్యాయంలో చేసిన వివరణమని గ్రహించాలి. ఈ రీతిలో వక్తృవైలక్షణ్యాన్నిబట్టి తిరుప్పావైకు గల ప్రత్యేకత స్పష్టం. "వేదమనైత్తుక్కుమ్ విత్తాకుమ్ కోదైతమ్మిత్" అనే పూర్వాచార్య సూక్తి ద్వారా ప్రబంధవైలక్షణ్యం - "మార్గ శ్రీ నీరాడల్" - అనేపదానికి చరమ పర్వనిష్ఠావగాహనమని స్వాపదేశార్థం కనుక ప్రమేయవైలక్షణ్యం కూడా ఈ ప్రబంధానికి ఉన్నాయి.
శ్రీమన్నాథమునులనుండి ప్రవర్తించిన ఆచార్యపరంపరలోని పూర్వాచార్యు లందఱు ఈ ప్రబంధాన్ని విశేషంగా ఆదరించారు. భగవద్రామానుజులకు ఈ ప్రబల గౌరవాన్నిబట్టి "తిరుప్పావై జీయర్" అనే నామంతో ఆ ఆచార్యవర్యులు సంప్రదాయంలో వ్యవహరింపబడుతున్నారు. పెరియవాచ్చాన్పళ్ళై అనుగ్రహించిన మూవాయిరప్పడి వ్యాఖ్య. అంకియమణవాళ ప్పెరుమాళ్ నాయనార్ అనుగ్రహించిన ఆజాయిరప్పడి వ్యాఖ్య, శ్రీవరవరమునులకు సమకాలీనులైన తిరునారాయణపురత్తు ఆయ్- అనే ఆచార్యులు అనుగ్రహించిన................
భాగవత ప్రాభృతకం దివ్యసూరులుగా కీర్తింపబడే ఆర్వార్లు అనుగ్రహించిన దివ్యప్రబంధాలలో ఆర్డర్ అనుగ్రహించిన "తిరుప్పావై" దివ్యప్రబంధం ప్రత్యేకమైన స్థానాన్ని అలంకరిస్తున్నది. శ్రీవైష్ణవాలయాలలోనే కాక, ప్రతి వైష్ణవ గృహాలలో కూడా ఈ అనుసంధింపబడకుండా నిత్యారాధన జరుగదు. ఈ ప్రబంధవైలక్షణ్యాన్ని గూర్చి తెలియజేయడానికి ఈ ఒక్క విషయమే చాలు "అజ్ఞుకుడిక్కు ఒరు శన్తతియాయ్, ఆఖ్వారకర్తమ్ శెయలై విశనిల్కుమ్ తన్మైయళాయ్ పిజ్జాయ్ పుత్తాలై అద్దాలై" (మంగళాశాసనం చేసే దివ్యసూరుల కులానికి ఏకైక పుత్రికయై. ఆ ఆథ్వార్ల భక్తికి మించిన భక్తిని కల్గినదై, చిన్నవయస్సులోనే పరిణతిని పొందిన ఆణ్ణాల్ను) అని శ్రీమణవాళ మహామునులు ఉపదేశరత్తనమాలై ప్రబంధంలో అనుగ్రహించిన శ్రీసూక్తి గోదాదేవి యొక్క జ్ఞానభక్తుల వైలక్షణ్యాన్ని తెల్పుతున్నది. దివ్యసూరులు "ఆఖ్వార్లు" (అవగాహిస్తున్నవారు- ఇంకా భగవదనుభవ పర్యంతసీమను పూర్తిగా దర్శించనివారు) కాగా, ఈమె "ఆల్" (ఆన్డాళ్) (భగవదనుభవాన్ని పూర్ణంగా అవగాహించినది) అనే శబ్దచమత్కృతి పూర్వకమైన వివరణాన్ని కూడా పెద్దలు తెల్పుతారు. ఇది "ఏకదేశవికృత మనన్యవద్భవతి" అనే న్యాయాన్ని పురస్కరించుకొని "న హి నిందా" న్యాయంలో చేసిన వివరణమని గ్రహించాలి. ఈ రీతిలో వక్తృవైలక్షణ్యాన్నిబట్టి తిరుప్పావైకు గల ప్రత్యేకత స్పష్టం. "వేదమనైత్తుక్కుమ్ విత్తాకుమ్ కోదైతమ్మిత్" అనే పూర్వాచార్య సూక్తి ద్వారా ప్రబంధవైలక్షణ్యం - "మార్గ శ్రీ నీరాడల్" - అనేపదానికి చరమ పర్వనిష్ఠావగాహనమని స్వాపదేశార్థం కనుక ప్రమేయవైలక్షణ్యం కూడా ఈ ప్రబంధానికి ఉన్నాయి. శ్రీమన్నాథమునులనుండి ప్రవర్తించిన ఆచార్యపరంపరలోని పూర్వాచార్యు లందఱు ఈ ప్రబంధాన్ని విశేషంగా ఆదరించారు. భగవద్రామానుజులకు ఈ ప్రబల గౌరవాన్నిబట్టి "తిరుప్పావై జీయర్" అనే నామంతో ఆ ఆచార్యవర్యులు సంప్రదాయంలో వ్యవహరింపబడుతున్నారు. పెరియవాచ్చాన్పళ్ళై అనుగ్రహించిన మూవాయిరప్పడి వ్యాఖ్య. అంకియమణవాళ ప్పెరుమాళ్ నాయనార్ అనుగ్రహించిన ఆజాయిరప్పడి వ్యాఖ్య, శ్రీవరవరమునులకు సమకాలీనులైన తిరునారాయణపురత్తు ఆయ్- అనే ఆచార్యులు అనుగ్రహించిన................© 2017,www.logili.com All Rights Reserved.