ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ వివిధ ఐ.టి.ఐ. లలో చదివే చాలా మంది విద్యార్థులు.సాధారణంగా ఐ.టి.ఐ. లో ఎలక్ట్రీషియన్ లేదా వైర్ మెన్ కోర్సులలో జాయిన్ అయ్యే విద్యార్థులందరూ టెంత్ మాత్రం పాస్ అయివుంటారు. ఆ పదవ తరగతి పరిజ్ఞానం వీరికి ఇంగ్లిష్ ధారాళంగా చదివి అర్థం చేసుకునేంత శక్తిని కలిగించలేదు. అందువల్ల ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి చెందిన పుస్తకాలు స్వయంగా చదివి అందులోని సారాంశాన్ని గ్రహించాగలగడం వీరికి అసాధ్యమయిన పని కాకపోయినా కాస్త కష్టంతో కూడుకున్నదే! ఐ.టి.ఐ. లలో ఇన్ స్ట్రక్టర్ కూడా చాలా వరకూ ఇంగ్లీషులో బోధించడం, లేదంటే నోట్స్ ఇంగ్లీషులో మాత్రమే ఇవ్వడం వల్ల... వీరు దాన్ని కంఠస్థం చేసి పరీక్షలలో మంచి మార్కులు సాధించుకో గలుగుతున్నారు తప్ప... నిజంగా ఆ ఇంజనీరింగ్ అంశాలను తమ మెదడుకి ఎక్కించుకోలేకపోతున్నారు. ఐ.టి.ఐ.పాస్ అయిన తరువాత పరిశ్రమలలో ఉద్యోగం సంపాదించినప్పుడు వీరికి అసలు సమస్య మొదలవుతుంది.
నాకు ఇంజనీరింగ్ లో ఉన్న అనుభవం మాత్రమే కాకుండా చాలా బుక్స్ రిఫర్ చేసి ఇందులోని అంశాలను ప్రజంట్ చేశాను. ఇది ఒక ఐ.టి.ఐ. స్థాయి విద్యార్థికి మాత్రమే కాకుండా అంతకంటే పై స్తాయి అంటే డిప్లమో వారికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ పుస్తకం ఆమూలాగ్రం చదవండి. మీ చదువుకి ఇది ఒక ఆలంబనలా, ఒక గైడ్ ళా ఉపయోగపడుతుందని ఆశిస్తాను.
పి నరసింహారావు
ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ వివిధ ఐ.టి.ఐ. లలో చదివే చాలా మంది విద్యార్థులు.సాధారణంగా ఐ.టి.ఐ. లో ఎలక్ట్రీషియన్ లేదా వైర్ మెన్ కోర్సులలో జాయిన్ అయ్యే విద్యార్థులందరూ టెంత్ మాత్రం పాస్ అయివుంటారు. ఆ పదవ తరగతి పరిజ్ఞానం వీరికి ఇంగ్లిష్ ధారాళంగా చదివి అర్థం చేసుకునేంత శక్తిని కలిగించలేదు. అందువల్ల ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి చెందిన పుస్తకాలు స్వయంగా చదివి అందులోని సారాంశాన్ని గ్రహించాగలగడం వీరికి అసాధ్యమయిన పని కాకపోయినా కాస్త కష్టంతో కూడుకున్నదే! ఐ.టి.ఐ. లలో ఇన్ స్ట్రక్టర్ కూడా చాలా వరకూ ఇంగ్లీషులో బోధించడం, లేదంటే నోట్స్ ఇంగ్లీషులో మాత్రమే ఇవ్వడం వల్ల... వీరు దాన్ని కంఠస్థం చేసి పరీక్షలలో మంచి మార్కులు సాధించుకో గలుగుతున్నారు తప్ప... నిజంగా ఆ ఇంజనీరింగ్ అంశాలను తమ మెదడుకి ఎక్కించుకోలేకపోతున్నారు. ఐ.టి.ఐ.పాస్ అయిన తరువాత పరిశ్రమలలో ఉద్యోగం సంపాదించినప్పుడు వీరికి అసలు సమస్య మొదలవుతుంది. నాకు ఇంజనీరింగ్ లో ఉన్న అనుభవం మాత్రమే కాకుండా చాలా బుక్స్ రిఫర్ చేసి ఇందులోని అంశాలను ప్రజంట్ చేశాను. ఇది ఒక ఐ.టి.ఐ. స్థాయి విద్యార్థికి మాత్రమే కాకుండా అంతకంటే పై స్తాయి అంటే డిప్లమో వారికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ పుస్తకం ఆమూలాగ్రం చదవండి. మీ చదువుకి ఇది ఒక ఆలంబనలా, ఒక గైడ్ ళా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. పి నరసింహారావుE book very arjently plz,print cheyandi stok pettandi
E book telugu medium vallake baga use avuthundhi Thanks you sir
© 2017,www.logili.com All Rights Reserved.