ఆరేడేళ్ళ పిల్లలకి ఈ పుస్తకంలో ఇచ్చిన వైజ్ఞానిక సంగతులు అర్థమవుతాయా? మునుపటి తరాలు భావించిన దానికన్నా పిల్లలలో ధీశక్తి మరింత అధికమని మనస్తత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేవలం దృశ్యరూపాత్మక విషయాలలోనే కాక, అరూపమైన విషయాలలో కూడా పిల్లలు చక్కని అవగాహన కలిగించుకోగలరని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ పుస్తకంలో ఎన్నో చక్కని, రంగుల బొమ్మలు ఉన్నాయి. చదవటం వల్ల ఏర్పడ్డ అవగాహనని ఈ బొమ్మలు మరింత ప్రభావితం చేస్తాయి, ప్రగాడం చేస్తాయి. పుస్తకాన్ని చూస్తున్న పిల్లల దృష్టి ముందుగా ఈ బొమ్మల మీదకే పోతుంది. ఈ బొమ్మలని ఆధారంగా చేసుకుని చదివిన విషయాలని పిల్లలతో చర్చించవచ్చు.
బొమ్మల పట్ల ఆకర్షితులై పిల్లలు కావాలంటే వాటి గురించి సొంతంగా కథలు అల్లుకోవచ్చు. పేజీల అంచులలో ఇచ్చిన అదనపు వివరణలు, ఫోటోలు మొదలైనవి ఖగోళ భావాలని, దృగ్విషయాలని పిల్లలు మరింత తేలికగా అర్థం చేసుకోవడంలో దోహదం చేస్తాయి. ఈ పుస్తకంలో ఒక్కొక్క కథని పిల్లలకి చదివి వినిపించాక ఆ కథ వాళ్లకి ఎంత మేరకు అర్థమయ్యిందో, ఎంత వరకు గుర్తుందో ఒకసారి అడగాలి. చదివిన విషయం కఠినంగా తోస్తే మరోసారి చదివి, బొమ్మల సహాయంతో వివరించే ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకం వల్ల మన బాలపాఠకులకు, శ్రోతలకు ఖగోళ విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగితే, సూర్య చంద్రుల గురించి, గ్రహకూటమి గురించి మరింత తెలుసుకోవాలని ఉబలాటం కలిగితే మా ప్రయత్నం విజయవంతం అయినట్లే.
ఆరేడేళ్ళ పిల్లలకి ఈ పుస్తకంలో ఇచ్చిన వైజ్ఞానిక సంగతులు అర్థమవుతాయా? మునుపటి తరాలు భావించిన దానికన్నా పిల్లలలో ధీశక్తి మరింత అధికమని మనస్తత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కేవలం దృశ్యరూపాత్మక విషయాలలోనే కాక, అరూపమైన విషయాలలో కూడా పిల్లలు చక్కని అవగాహన కలిగించుకోగలరని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ పుస్తకంలో ఎన్నో చక్కని, రంగుల బొమ్మలు ఉన్నాయి. చదవటం వల్ల ఏర్పడ్డ అవగాహనని ఈ బొమ్మలు మరింత ప్రభావితం చేస్తాయి, ప్రగాడం చేస్తాయి. పుస్తకాన్ని చూస్తున్న పిల్లల దృష్టి ముందుగా ఈ బొమ్మల మీదకే పోతుంది. ఈ బొమ్మలని ఆధారంగా చేసుకుని చదివిన విషయాలని పిల్లలతో చర్చించవచ్చు. బొమ్మల పట్ల ఆకర్షితులై పిల్లలు కావాలంటే వాటి గురించి సొంతంగా కథలు అల్లుకోవచ్చు. పేజీల అంచులలో ఇచ్చిన అదనపు వివరణలు, ఫోటోలు మొదలైనవి ఖగోళ భావాలని, దృగ్విషయాలని పిల్లలు మరింత తేలికగా అర్థం చేసుకోవడంలో దోహదం చేస్తాయి. ఈ పుస్తకంలో ఒక్కొక్క కథని పిల్లలకి చదివి వినిపించాక ఆ కథ వాళ్లకి ఎంత మేరకు అర్థమయ్యిందో, ఎంత వరకు గుర్తుందో ఒకసారి అడగాలి. చదివిన విషయం కఠినంగా తోస్తే మరోసారి చదివి, బొమ్మల సహాయంతో వివరించే ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకం వల్ల మన బాలపాఠకులకు, శ్రోతలకు ఖగోళ విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగితే, సూర్య చంద్రుల గురించి, గ్రహకూటమి గురించి మరింత తెలుసుకోవాలని ఉబలాటం కలిగితే మా ప్రయత్నం విజయవంతం అయినట్లే.© 2017,www.logili.com All Rights Reserved.