దేశంలో సరళీకరణ ఆర్ధిక విధానాలు అవలంబించిన తరువాత వినిమయతత్వం అంతకంతకూ పెరిగి ప్రజలు వస్తువులు సమకూర్చుకోవడం కోసం ఆదాయాలు చాలక అప్పులు పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చడానికి సంపాదనను పెంచుకోవాల్సి వస్తుంది. మరిన్ని గంటలు పని చేయవలసి వస్తుంది. ఈ క్రమంలో అసమానతలు పెరిగి సంపద కేంద్రీకరణ కూడా పెరుగుతోంది. కేవలం 1 శాతం మంది ప్రజల వద్ద 63 శాతం సంపద పోగుపడిపోయింది.
ఒకరినొకరు దోచుకున్నంత కాలం ప్రజల జీవితాల్లో మార్పులు రావు. సమసమాజం సిద్ధించినపుడే అందరికీ మూడుపూటలా తిండి, సుఖవంతమైన జీవితం లభిస్తుందని గుర్తించాలి. ఈ వైరుధ్యాలు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారికి ప్రేరణగా ఈ అరుణతారలు పుస్తకాలు నిలుస్తాయి. ఇందులో 1934 నుంచి నేటి వరకూ దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా, సమసమాజ స్థాపన, సమాజ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసి, లక్ష్య సాధనలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి మహనీయుల జీవిత చరిత్రలను పొందుపరచడం జరిగింది. ఒక్కో జీవిత చరిత్ర పాఠకులకు ఉత్ప్రేరకంలా ఉత్తేజాన్ని నింపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పుస్తకాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
దేశంలో సరళీకరణ ఆర్ధిక విధానాలు అవలంబించిన తరువాత వినిమయతత్వం అంతకంతకూ పెరిగి ప్రజలు వస్తువులు సమకూర్చుకోవడం కోసం ఆదాయాలు చాలక అప్పులు పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చడానికి సంపాదనను పెంచుకోవాల్సి వస్తుంది. మరిన్ని గంటలు పని చేయవలసి వస్తుంది. ఈ క్రమంలో అసమానతలు పెరిగి సంపద కేంద్రీకరణ కూడా పెరుగుతోంది. కేవలం 1 శాతం మంది ప్రజల వద్ద 63 శాతం సంపద పోగుపడిపోయింది. ఒకరినొకరు దోచుకున్నంత కాలం ప్రజల జీవితాల్లో మార్పులు రావు. సమసమాజం సిద్ధించినపుడే అందరికీ మూడుపూటలా తిండి, సుఖవంతమైన జీవితం లభిస్తుందని గుర్తించాలి. ఈ వైరుధ్యాలు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారికి ప్రేరణగా ఈ అరుణతారలు పుస్తకాలు నిలుస్తాయి. ఇందులో 1934 నుంచి నేటి వరకూ దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా, సమసమాజ స్థాపన, సమాజ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసి, లక్ష్య సాధనలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి మహనీయుల జీవిత చరిత్రలను పొందుపరచడం జరిగింది. ఒక్కో జీవిత చరిత్ర పాఠకులకు ఉత్ప్రేరకంలా ఉత్తేజాన్ని నింపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పుస్తకాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.