తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్యే ఆలోచనా స్రవంతిపై ఓ కన్నేసి ఉంచడమే. దీనికి తీరిక అవసరం లేదు. కొద్దిపాటి నిశితమైన గమనింపు చాలు. అన్నీ అర్థమవుతాయి. మన నోటి నుంచి వచ్చే మాటల దగ్గరనుంచి.. మన మనస్సులో ఓ చోట ప్రారంభమై సుడులు తిరుగుతూ ఓ మనోవికారంగా బయటపడే ఆలోచనల వరకూ అన్నింటి గమనమూ స్పష్టంగా తెలుస్తుంది.
నా జీవితం నా కళ్ళెదుట సినిమాలా కనిపిస్తున్నప్పుడు అనిపించే ఒకే ఒక ఫీలింగ్.. లైఫ్ చాలా సింపుల్ అని. మనమే మన పైత్యాలతో, వాటి ద్వారా వచ్చే పరిణామాలతో క్లిష్టతరం చేసుకుంటున్నాం. మన ఆలోచనలు తిన్నగా ఉండవు. మన వ్యక్తిత్వం తిన్నగా ఉండదు. మన రిలేషన్లు బలంగా ఉండవు. ప్రకృతితో అటాచ్మెంట్ అనేదే ఉండదు. రకరకాల విషపు ఆలోచనల్ని హృదయం నిండా నింపుకొని అభద్రత మధ్య బతుకుతున్న వారికి చాలా చెప్పాలనిపించింది. ఆ చెప్పాలనిపించిందంతా ఈ పుస్తక రూపంలో మీకు అందించడం జరుగుతోంది.
- నల్లమోతు శ్రీధర్
తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్యే ఆలోచనా స్రవంతిపై ఓ కన్నేసి ఉంచడమే. దీనికి తీరిక అవసరం లేదు. కొద్దిపాటి నిశితమైన గమనింపు చాలు. అన్నీ అర్థమవుతాయి. మన నోటి నుంచి వచ్చే మాటల దగ్గరనుంచి.. మన మనస్సులో ఓ చోట ప్రారంభమై సుడులు తిరుగుతూ ఓ మనోవికారంగా బయటపడే ఆలోచనల వరకూ అన్నింటి గమనమూ స్పష్టంగా తెలుస్తుంది. నా జీవితం నా కళ్ళెదుట సినిమాలా కనిపిస్తున్నప్పుడు అనిపించే ఒకే ఒక ఫీలింగ్.. లైఫ్ చాలా సింపుల్ అని. మనమే మన పైత్యాలతో, వాటి ద్వారా వచ్చే పరిణామాలతో క్లిష్టతరం చేసుకుంటున్నాం. మన ఆలోచనలు తిన్నగా ఉండవు. మన వ్యక్తిత్వం తిన్నగా ఉండదు. మన రిలేషన్లు బలంగా ఉండవు. ప్రకృతితో అటాచ్మెంట్ అనేదే ఉండదు. రకరకాల విషపు ఆలోచనల్ని హృదయం నిండా నింపుకొని అభద్రత మధ్య బతుకుతున్న వారికి చాలా చెప్పాలనిపించింది. ఆ చెప్పాలనిపించిందంతా ఈ పుస్తక రూపంలో మీకు అందించడం జరుగుతోంది. - నల్లమోతు శ్రీధర్© 2017,www.logili.com All Rights Reserved.