అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో ఒక కోడి కూసుంది. దాన్ని మనం తెలుగులోకి “కొక్కొరోకో” అని అనువదించుకొంటాము. “ఏమిటి దీని అర్థం? ”“తెల్లారింది. అంతా మేలుకోండి” అని అర్థం. ఇలా మనల్ని మేలుకొలిపే సాహిత్యం అన్ని భాషలలోనూ వుంది. దాన్ని మనం అనువదించుకుంటున్నాం కూడా. (రష్యన్ నుంచి నవలలు, స్పానిష్ నుంచి కవిత్వం, ఇంగ్లీషు నుంచి నాటకాలు, నాటికలూ ఇత్యాదులు.)
కథా రచయితకి ముఖ్యంగా మూడు లక్షణాలుండాలని మొపాసా కాబోలు అన్నాడను కుంటాను. అవి "స్పష్టత. స్పష్టత. మళ్ళీ స్పష్టత” (మళ్ళీ కాదు. “Clarite, Clarite, ettojours clarite” అని కాదూ ఫ్రెంచిలో ఉంది! ఎల్లప్పుడూ స్వచ్చత. Always clarity.)
నవలలు కుడ్యచిత్రాలు(Mural Paintings) అనీ, కథానికలు శ్నాప్ షాట్స్ అని నేను అభివర్ణిస్తూ ఉంటాను. వీటిని సృష్టించడానికి ఈనాటి రచయిత రెండు కెమరాల సాయం స్వీకరించవలసి ఉంటుంది. మార్క్సిజం అనే సినీ-కెమారా ఒకటి, సైకో ఎనాలసిస్ అనే XRay కెమెరా ఇంకొకటి. నేటి రచయితలకు యీరెండూ రెండు కళ్ళలాంటవి. గొప్ప రచయితలు జీవితాన్ని యీ నేత్రద్వయంతోనే చూస్తారు. అలా చూసినట్టు నిదర్శనంగానే ఒక చిన్న కథ అయినా, ఒక పెద్దనవల అయినా ఉండాలి. అప్పుడే అది గొప్ప రచన. అందుకే ఉత్తమ సాహిత్యం బహు కొద్దిగానూ, చెత్తసాహిత్యం కోకొల్లలుగాను మనకు లభ్యమవుతుంది. "
'ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేననువదించను' -
ఇంగ్లీషు ఒక ద్వారం-దీని ద్వారా నాకు ప్రపంచంలోని ఎన్నో భాషల కవిత్వపు భవనాలలోనికి ప్రవేశం లభించింది ".
రచన : శ్రీశ్రీ
సేకరణ : సింగంపల్లి అశోక కుమార్
అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో ఒక కోడి కూసుంది. దాన్ని మనం తెలుగులోకి “కొక్కొరోకో” అని అనువదించుకొంటాము. “ఏమిటి దీని అర్థం? ”“తెల్లారింది. అంతా మేలుకోండి” అని అర్థం. ఇలా మనల్ని మేలుకొలిపే సాహిత్యం అన్ని భాషలలోనూ వుంది. దాన్ని మనం అనువదించుకుంటున్నాం కూడా. (రష్యన్ నుంచి నవలలు, స్పానిష్ నుంచి కవిత్వం, ఇంగ్లీషు నుంచి నాటకాలు, నాటికలూ ఇత్యాదులు.) కథా రచయితకి ముఖ్యంగా మూడు లక్షణాలుండాలని మొపాసా కాబోలు అన్నాడను కుంటాను. అవి "స్పష్టత. స్పష్టత. మళ్ళీ స్పష్టత” (మళ్ళీ కాదు. “Clarite, Clarite, ettojours clarite” అని కాదూ ఫ్రెంచిలో ఉంది! ఎల్లప్పుడూ స్వచ్చత. Always clarity.) నవలలు కుడ్యచిత్రాలు(Mural Paintings) అనీ, కథానికలు శ్నాప్ షాట్స్ అని నేను అభివర్ణిస్తూ ఉంటాను. వీటిని సృష్టించడానికి ఈనాటి రచయిత రెండు కెమరాల సాయం స్వీకరించవలసి ఉంటుంది. మార్క్సిజం అనే సినీ-కెమారా ఒకటి, సైకో ఎనాలసిస్ అనే XRay కెమెరా ఇంకొకటి. నేటి రచయితలకు యీరెండూ రెండు కళ్ళలాంటవి. గొప్ప రచయితలు జీవితాన్ని యీ నేత్రద్వయంతోనే చూస్తారు. అలా చూసినట్టు నిదర్శనంగానే ఒక చిన్న కథ అయినా, ఒక పెద్దనవల అయినా ఉండాలి. అప్పుడే అది గొప్ప రచన. అందుకే ఉత్తమ సాహిత్యం బహు కొద్దిగానూ, చెత్తసాహిత్యం కోకొల్లలుగాను మనకు లభ్యమవుతుంది. " 'ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేననువదించను' - ఇంగ్లీషు ఒక ద్వారం-దీని ద్వారా నాకు ప్రపంచంలోని ఎన్నో భాషల కవిత్వపు భవనాలలోనికి ప్రవేశం లభించింది ". ( సచిరౌతాయ్ కథలు (తెలుగు అనువాదానికి) ముందుమాట. తిరుపతి, 14-3-78) ( కారెల్ చాపెక్ 'అమ్మా' రెండవ ముద్రణకు తొలిపలుకు 1967 ) 3. ('అనంతం', ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల 'ప్రజాతంత్ర' వారపత్రిక, 30-11-1975 ) రచన : శ్రీశ్రీ సేకరణ : సింగంపల్లి అశోక కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.