ఈ పుస్తకంలో ఉన్నవన్నీ అనువాద కథలు. విదేశభాషా కథలూ, భారతీయ ఆంగ్ల కథలూ, మనదేశంలోని ఇతర భాషా కథలూ ఉన్నాయి. ఇన్ని అనువాద కథల్ని ఒక్కచోట చదవటం అనేది ఒక మంచి సాహిత్యానుభవం. ఇతర భాషా రచనలు మనకు ఆయా భాషలలోని కథకుల భావజాలాన్ని అందిస్తున్నాయి. వారి ప్రాపంచిక దృక్పథాన్ని తెలుపుతున్నాయి. ఆయా ప్రదేశాలలోని భాషా, సాహిత్య, సాంస్కృతిక సామాజిక నేపథ్యాన్ని తెలుపుతున్నాయి. అక్కడి జన జీవనంలోని 'విలక్షణత' నీ, ప్రత్యేక 'అస్తిత్వాన్నీ' అవగాహన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ అంశాల తులనాత్మక పరిశీలనకి ఆకర గ్రంథంగా కూడా నిలుస్తుంది ఈ సంపుటి. ఆ విధంగా మనమీ గ్రంథాన్ని స్వాగతించాలి. రచయితని అభినందించాలి.
అనువాదానికి తగిన కథల్నీ, తన హృదయోద్వేగాలకి - దగ్గరగా ఉన్న కథల్ని ఎన్నుకున్నారు పార్థసారథి. ఎక్కువగా ఆంగ్లం నుండి అనువదించవలసి వచ్చినా, మూలకథలోని 'నేటివిటీ' పట్టుకున్నారు. ఆయా రచయితల శిల్పాన్నీ, శైలినీ గౌరవించారు. 'ఉన్నది ఉన్నట్టు' చెబుతూనే, తెలుగులో తన శైలిలో సరళత్వాన్ని మనకు అందించారు. అదే ఈ కథలకి అబ్బిన పుష్కలమైన చదివించే గుణానికి కారణం. అనువాదకుడుగా పార్థసారథి సాధించుకున్న రచనా నైపుణ్యం ఇది. ఆ నైపుణ్యం వల్లనే ప్రతి కథా మనల్ని తన వాతావరణంలోకి తీసుకొనిపోయి, కూర్చోబెట్టి లేవనీయదు. వస్తు శిల్పాలలో నిమగ్నుల్ని చేస్తుంది. ఇదీ పార్థసారథి విజయం!
ఈ పుస్తకంలో ఉన్నవన్నీ అనువాద కథలు. విదేశభాషా కథలూ, భారతీయ ఆంగ్ల కథలూ, మనదేశంలోని ఇతర భాషా కథలూ ఉన్నాయి. ఇన్ని అనువాద కథల్ని ఒక్కచోట చదవటం అనేది ఒక మంచి సాహిత్యానుభవం. ఇతర భాషా రచనలు మనకు ఆయా భాషలలోని కథకుల భావజాలాన్ని అందిస్తున్నాయి. వారి ప్రాపంచిక దృక్పథాన్ని తెలుపుతున్నాయి. ఆయా ప్రదేశాలలోని భాషా, సాహిత్య, సాంస్కృతిక సామాజిక నేపథ్యాన్ని తెలుపుతున్నాయి. అక్కడి జన జీవనంలోని 'విలక్షణత' నీ, ప్రత్యేక 'అస్తిత్వాన్నీ' అవగాహన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ అంశాల తులనాత్మక పరిశీలనకి ఆకర గ్రంథంగా కూడా నిలుస్తుంది ఈ సంపుటి. ఆ విధంగా మనమీ గ్రంథాన్ని స్వాగతించాలి. రచయితని అభినందించాలి. అనువాదానికి తగిన కథల్నీ, తన హృదయోద్వేగాలకి - దగ్గరగా ఉన్న కథల్ని ఎన్నుకున్నారు పార్థసారథి. ఎక్కువగా ఆంగ్లం నుండి అనువదించవలసి వచ్చినా, మూలకథలోని 'నేటివిటీ' పట్టుకున్నారు. ఆయా రచయితల శిల్పాన్నీ, శైలినీ గౌరవించారు. 'ఉన్నది ఉన్నట్టు' చెబుతూనే, తెలుగులో తన శైలిలో సరళత్వాన్ని మనకు అందించారు. అదే ఈ కథలకి అబ్బిన పుష్కలమైన చదివించే గుణానికి కారణం. అనువాదకుడుగా పార్థసారథి సాధించుకున్న రచనా నైపుణ్యం ఇది. ఆ నైపుణ్యం వల్లనే ప్రతి కథా మనల్ని తన వాతావరణంలోకి తీసుకొనిపోయి, కూర్చోబెట్టి లేవనీయదు. వస్తు శిల్పాలలో నిమగ్నుల్ని చేస్తుంది. ఇదీ పార్థసారథి విజయం!© 2017,www.logili.com All Rights Reserved.