పొద్దుపొడుపు వేళ...
నీరెండ మొదలయింది. పక్షుల కిలకిలారావాలు.... జనసందోహపు అలికిడి... గూడు విడిచిన కోడిపుంజు కొక్కోరోక్కో అని కూసింది. కాలమహిమ అనుకున్నాడు - కసువు చిమ్ముతున్న పరమయ్య.
'తొలికోడి కూత అంటే ఏమిటో ఇప్పటి తరానికి బొత్తిగా తెలీనీకుండా చేస్తున్నాయి. ఈ కోళ్ళు' అనుకుని లేగ నొదిలాడు. తల్లి పొదుగుదాపుకు రెండు గెంతులలో చేరింది.
' ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. దశరథంగారి ఇల్లాలు 'సీతమ్మ' బయటకొచ్చింది.
'పరమయ్య కనిపించాడు. "నువ్వు వచ్చావేంటి? 'నాగులు'కు ఏమయింది?" అడిగింది
'రాడట." “ఈ పొద్దేనా?” “ఆ.... వాళ్ళ అక్క ఇంటికొచ్చింది.”
“అయితే గేదెను 'జంగిరి' మందను కాసే గోపాలానికి అప్పగించు. పొద్దస్తమానం దానితో పడలేవు" అంది.
“అట్లాగే" అంటూ పెరటి గుమ్మం దగ్గరకొచ్చి వెనక్కి నడిచాడు..........
పొద్దుపొడుపు వేళ...నీరెండ మొదలయింది. పక్షుల కిలకిలారావాలు.... జనసందోహపు అలికిడి... గూడు విడిచిన కోడిపుంజు కొక్కోరోక్కో అని కూసింది. కాలమహిమ అనుకున్నాడు - కసువు చిమ్ముతున్న పరమయ్య. 'తొలికోడి కూత అంటే ఏమిటో ఇప్పటి తరానికి బొత్తిగా తెలీనీకుండా చేస్తున్నాయి. ఈ కోళ్ళు' అనుకుని లేగ నొదిలాడు. తల్లి పొదుగుదాపుకు రెండు గెంతులలో చేరింది. ' ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. దశరథంగారి ఇల్లాలు 'సీతమ్మ' బయటకొచ్చింది. 'పరమయ్య కనిపించాడు. "నువ్వు వచ్చావేంటి? 'నాగులు'కు ఏమయింది?" అడిగింది 'రాడట." “ఈ పొద్దేనా?” “ఆ.... వాళ్ళ అక్క ఇంటికొచ్చింది.” “అయితే గేదెను 'జంగిరి' మందను కాసే గోపాలానికి అప్పగించు. పొద్దస్తమానం దానితో పడలేవు" అంది. “అట్లాగే" అంటూ పెరటి గుమ్మం దగ్గరకొచ్చి వెనక్కి నడిచాడు..........© 2017,www.logili.com All Rights Reserved.