మానవ సంబంధాలన్నీ మార్కెట్ సంబంధాలుగా, మనీ సంబంధాలుగా మారిపోయిన ఒక అవాంఛనీయ సందర్భం నేటి సమాజాన్ని ఔషధరహిత వ్యాధిగా పట్టి పీడిస్తోంది. అమ్మ కడుపులోని ఉమ్మనీటితోనే ఉమ్మడి కుటుంబాల సుగంధాల్ని కడిగేసుకుంటున్న ఒంటరితనపు జీవితాలకు, కాపురాలకు జేజేలు పలుకుతున్న కుసంస్కృతి వేళ్లూనుకుంటుంది. అలాంటి నేటి సమాజంలో జీవిస్తున్న మానవ సమూహానికి అత్యంత అవసరమైన సాహిత్యం కథల రూపంలో వస్తే బాగుంటుందన్న నా ఆలోచనలకు సరైన అక్షర రూపమే కోటమర్తి రాధాహిమబిందు కథలు. ఈ కథలన్నీ మానవత్వపు సువాసనతో పరిమళిస్తూ మనిషి అనుబంధాల చుట్టూ అల్లుకున్నవే. చదివితే తప్పక మీరూ నాతో ఏకీభవిస్తారు.
- కోటమర్తి రాధాహిమబిందు