"ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం.
ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు; ముడిపదార్థం మాత్రం జీవితం" అంటారు కొడవటిగంటి కుటుంబరావు.
ఆధునిక తెలుగుసాహిత్య ప్రక్రియలలో కథ క్లిష్టమైనది మాత్రమే కాదు, సంక్లిష్ట సామాజిక జీవన పరిస్థితులను కథ ప్రతిబింబించినంత స్పష్టంగా, సూటిగా మరే ప్రక్రియా ప్రతిబింబించలేదనే చెప్పాలి. అందుకే కథారచన ఉన్నతశిఖరాలందుకుందని చెప్పుకోవచ్చును.
సాహిత్యం సమాజహితం కోసం మాత్రమేకాదు. సమాజ మూలమూలాల్ని, లోతుల్నీ, జీవనరీతుల్ని, ప్రతిబింబించేదిగా ఉండాలి. సమాజంలోని వ్యక్తుల జీవితాన్ని దృశ్యమానం చేసేదిగా ఉండాలి.
కథ పుట్టిన దగ్గర నుండి ఇటీవల కాలం వరకూ ఎక్కువశాతం మధ్యతరగతి జీవిత చిత్రణకే కథ పరిమితమై పోయింది. తర్వాత్తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విలువల వలన కొంత వరకు దిగువ మధ్యతరగతి కథలేకాక, ఉన్నత తరగతుల జీవితం కూడా ఎక్కువగానే కథల లోనికి అక్షరబద్ధమౌతోంది.
కథకు ప్రధానంగా క్లుప్తత, గాఢత ముఖ్యం, పరిమిత పాత్రలతో ఆత్మ సంయమనస్వభావ లక్షణం, వస్తువునకు తగిన కథనాన్ని, పాత్రల జీవన స్వభావానికి తగిన సంభాషణలు ఉండటం మంచి లక్షణం. ఇక శైలి వ్యక్తిగతమైనది ఎవరి ధోరణి వారిదే. వారివారి అభిరుచులు, నమ్మకాలను అనుసరించి కథారచనలో మొదటినుండి చివరివరకూ అంతర్లీనంగా ప్రవాహంలా కలగలిసి అల్లిన అల్లికే వారి రచనాపద్ధతిగా, శైలిగా చెప్తాము................
శుభాకాంక్షలు - కథల లోగిలిలోని రంగవల్లులూ, రంగులూ- "ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం. ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు; ముడిపదార్థం మాత్రం జీవితం" అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ఆధునిక తెలుగుసాహిత్య ప్రక్రియలలో కథ క్లిష్టమైనది మాత్రమే కాదు, సంక్లిష్ట సామాజిక జీవన పరిస్థితులను కథ ప్రతిబింబించినంత స్పష్టంగా, సూటిగా మరే ప్రక్రియా ప్రతిబింబించలేదనే చెప్పాలి. అందుకే కథారచన ఉన్నతశిఖరాలందుకుందని చెప్పుకోవచ్చును. సాహిత్యం సమాజహితం కోసం మాత్రమేకాదు. సమాజ మూలమూలాల్ని, లోతుల్నీ, జీవనరీతుల్ని, ప్రతిబింబించేదిగా ఉండాలి. సమాజంలోని వ్యక్తుల జీవితాన్ని దృశ్యమానం చేసేదిగా ఉండాలి. కథ పుట్టిన దగ్గర నుండి ఇటీవల కాలం వరకూ ఎక్కువశాతం మధ్యతరగతి జీవిత చిత్రణకే కథ పరిమితమై పోయింది. తర్వాత్తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విలువల వలన కొంత వరకు దిగువ మధ్యతరగతి కథలేకాక, ఉన్నత తరగతుల జీవితం కూడా ఎక్కువగానే కథల లోనికి అక్షరబద్ధమౌతోంది. కథకు ప్రధానంగా క్లుప్తత, గాఢత ముఖ్యం, పరిమిత పాత్రలతో ఆత్మ సంయమనస్వభావ లక్షణం, వస్తువునకు తగిన కథనాన్ని, పాత్రల జీవన స్వభావానికి తగిన సంభాషణలు ఉండటం మంచి లక్షణం. ఇక శైలి వ్యక్తిగతమైనది ఎవరి ధోరణి వారిదే. వారివారి అభిరుచులు, నమ్మకాలను అనుసరించి కథారచనలో మొదటినుండి చివరివరకూ అంతర్లీనంగా ప్రవాహంలా కలగలిసి అల్లిన అల్లికే వారి రచనాపద్ధతిగా, శైలిగా చెప్తాము................© 2017,www.logili.com All Rights Reserved.