ఇప్పుడు మీ ముందున్న "అద్దంలో గాంధారి, మరి పదకొండు కథలు" అనే కథల సంకలనం షడ్రసోపేతమైన విందు భోజనం వంటిది. ఇందులో ఒక్కో రసానికి, రుచికి రెండేసి కథలు వడ్డించబడ్డాయి. కన్నడ, తమిళ, మళయాళాల్లోంచి ఆరు కథలు..., హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లోంచి ఆరు కథలు... వెరసి పన్నెండు కథల సమాహారం ఇది. అంటే దక్షిణాది నుండి ఆరు, ఉత్తరాది నుండి ఆరు,... కలిసి డజన్ కథలయ్యాయి. వీటిని మొదటి ప్రచురణగా 1996 లో "నయనం" తరపున తీసుకొచ్చారు. ఆ సంవత్సరమే తెలుగు విశ్వవిద్యాలయం ఈ కథా సంకలనానికి " ఉత్తమానువాద " సాహిత్య పురస్కారం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళి ఇరవై సంవత్సరాల తర్వాత నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ రెండవ ముద్రణ తీసుకొస్తుంది.