అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రపంచపరిధిలో విస్తరింపజేసిన మహనీయులలో శ్రీశంకర భగవత్పాదుల స్థానం అద్వితీయం. వారి రచనలు ప్రాథమికంగా రెండు రకాలు. ఒకటి – పరమత ఖండన పురస్సరంగా స్వసిద్ధాంత స్థాపనపరములైన శాస్త్రగ్రంథాలు. రెండు – గురువిశ్వాససంపన్నులైన సాధకులను ఉద్దేశించి వారికి ఆచరణయోగ్యమైన సాధనమార్గాలను ఉపదేశించే ప్రబోధగ్రంథాలు. వీటికే ప్రకరణగ్రంథాలని ప్రసిద్ధి.
ఇలాంటి ప్రకరణ గ్రంథాలలో ‘ఆత్మజ్ఞానోపదేశవిధి’, ‘మాయా వివరణము’ అనేవి గద్యాత్మకమైన అద్భుతరచనలు. వీటిలో ‘ఆత్మజ్ఞానోపదేశ విధి’ అద్వైత సిద్ధాంతం మొత్తాన్ని మెట్లుమెట్లుగా వింగడించి, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా, వాదాడంబర రహితంగా, మనకు అందిస్తుంది. రెండవదైన మాయావివరణం, ఈ విషయాలనే ఒకింత లోతుగా చర్చిస్తుంది.
అద్వైత సిద్ధాంతంలో ‘మాయ’ అనే అంశం చాలా కీలకమైనది. దీని మీదనే ప్రతిపక్షుల వాదావేషాలు ఎక్కువగా కేంద్రీకృతమైవుంటాయి. అలాంటి వాదార్భాటాల ప్రసక్తి లేకుండా మాయాతత్త్వాన్ని ఈ గ్రంథం సాధకులకు చక్కగా వివరిస్తుంది.
అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రపంచపరిధిలో విస్తరింపజేసిన మహనీయులలో శ్రీశంకర భగవత్పాదుల స్థానం అద్వితీయం. వారి రచనలు ప్రాథమికంగా రెండు రకాలు. ఒకటి – పరమత ఖండన పురస్సరంగా స్వసిద్ధాంత స్థాపనపరములైన శాస్త్రగ్రంథాలు. రెండు – గురువిశ్వాససంపన్నులైన సాధకులను ఉద్దేశించి వారికి ఆచరణయోగ్యమైన సాధనమార్గాలను ఉపదేశించే ప్రబోధగ్రంథాలు. వీటికే ప్రకరణగ్రంథాలని ప్రసిద్ధి. ఇలాంటి ప్రకరణ గ్రంథాలలో ‘ఆత్మజ్ఞానోపదేశవిధి’, ‘మాయా వివరణము’ అనేవి గద్యాత్మకమైన అద్భుతరచనలు. వీటిలో ‘ఆత్మజ్ఞానోపదేశ విధి’ అద్వైత సిద్ధాంతం మొత్తాన్ని మెట్లుమెట్లుగా వింగడించి, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా, వాదాడంబర రహితంగా, మనకు అందిస్తుంది. రెండవదైన మాయావివరణం, ఈ విషయాలనే ఒకింత లోతుగా చర్చిస్తుంది. అద్వైత సిద్ధాంతంలో ‘మాయ’ అనే అంశం చాలా కీలకమైనది. దీని మీదనే ప్రతిపక్షుల వాదావేషాలు ఎక్కువగా కేంద్రీకృతమైవుంటాయి. అలాంటి వాదార్భాటాల ప్రసక్తి లేకుండా మాయాతత్త్వాన్ని ఈ గ్రంథం సాధకులకు చక్కగా వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.