భిన్న బాషల భారతీయ కథతోరణం ఈ పుస్తకం. 22 భాషలలోని వివిధ కథలు మన గుండెల్ని గట్టిగానే తట్టి పలకరిస్తాయి. ప్రధాన భారతీయ భాషలే కాకుండా డోగ్రీ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, సంతాలీ, సింధి, తూళులాంటి తక్కువగా తెల్సిన భాషలలోని కథలను కూడా ఎన్నుకోవడం వల్ల సంకలనానికి భారతీయ బిన్నత్వంలోని ఏకత్వం చేకూరింది.
ఫన్నీ థింగ్ లా అనిపించే ప్రియుడి చావు, ఎప్పటికీ తెరవని ఆఖరి ఉత్తరం చెప్పే రహస్యం, విధి తనను తల్లి కాకుండా ఆడ్డుకుంది కానీ, ఇంట్లో చెట్టుకి తన మాతృప్రేమ పంచకుండా ఆపలేదని తృప్తి పడే ఇల్లాలు, గుడ్డి ముసలాయన, ఆయన భార్యల బతుకుపోరాటం, పెళ్ళి బంధం కట్టేసిన స్వేచ్ఛ కోసం పరితపించే అమ్మాయి, తప్పని పరిస్థితుల్లో వదిలేసిన కొడుకు, మలిసంధ్యలో వెతుక్కుంటూ వచ్చినపుడు ఓ తల్లి పడే ఆవేదన.....
ఇలా చక్కటి ఇతివృత్తాల కథల్ని ఎంచుకుని అన్ని కిటికీ ద్వారాలు ఒకేసారి తెరిచిన రంగనాథ రామచంద్రరావుగార్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే.
- రంగనాథ రామచంద్రరావు