తెలుగు బాలలూ! మిమ్మల్ని వెలుగుబాట నడిపించే పుస్తకం ఇది. ఈ బంగారు పుస్తకం పేరు 'బొమ్మరిల్లు'. ఇది నిజంగా బొమ్మరిల్లే. ఎంచక్కని బొమ్మలు, ఎన్నో ఎన్నో అందాలు చిందే బొమ్మలు దీనినిండా ఉన్నాయి. ఇదొక పాటల పుస్తకం. మీ కోసమే ఈ పాటలన్నీ వ్రాసింది. ప్రతి పాటలో ఒక భావం పరిమళిస్తోంది. ఈ పాటలన్నీ లయబద్ధంగా ఉన్నాయి. కమ్మగా పాడుకుంటూ, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆనందించండి! ఆదిని అమ్మను గూర్చి కమ్మని భావం. తరువాత తగిన శాస్తి, మర్యాదకు పొతే మట్టిగొట్టుకున్నట్లే, వేసం దెచ్చే గ్రాసం, గాలి పడగ గర్వం, పెరుబట్టి పెద్దరికం రాదు, రాణించని చదువు, పిసినారి, తాతకు తగిన మనుమడు మొదలైన ఎన్నో భావాలున్న పాటలు. నీటి, చక్కని హాస్యం జోడింపు ఈ గేయాలలో కనిపిస్తుంది. మీకెంతో వినోదాన్ని, విజ్ఞాన్ని అందించే అపురూపమైన పుస్తకం.
తెలుగు బాలలూ! మిమ్మల్ని వెలుగుబాట నడిపించే పుస్తకం ఇది. ఈ బంగారు పుస్తకం పేరు 'బొమ్మరిల్లు'. ఇది నిజంగా బొమ్మరిల్లే. ఎంచక్కని బొమ్మలు, ఎన్నో ఎన్నో అందాలు చిందే బొమ్మలు దీనినిండా ఉన్నాయి. ఇదొక పాటల పుస్తకం. మీ కోసమే ఈ పాటలన్నీ వ్రాసింది. ప్రతి పాటలో ఒక భావం పరిమళిస్తోంది. ఈ పాటలన్నీ లయబద్ధంగా ఉన్నాయి. కమ్మగా పాడుకుంటూ, అర్థాన్ని ఆస్వాదిస్తూ ఆనందించండి! ఆదిని అమ్మను గూర్చి కమ్మని భావం. తరువాత తగిన శాస్తి, మర్యాదకు పొతే మట్టిగొట్టుకున్నట్లే, వేసం దెచ్చే గ్రాసం, గాలి పడగ గర్వం, పెరుబట్టి పెద్దరికం రాదు, రాణించని చదువు, పిసినారి, తాతకు తగిన మనుమడు మొదలైన ఎన్నో భావాలున్న పాటలు. నీటి, చక్కని హాస్యం జోడింపు ఈ గేయాలలో కనిపిస్తుంది. మీకెంతో వినోదాన్ని, విజ్ఞాన్ని అందించే అపురూపమైన పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.