పదిహేడు గాయాల మాల మల్లీశ్వరి కథా సంపుటి. స్త్రీల హృదయ పత్రాల మీద చెరిగిపోని ఉక్కుపాదాల ముద్రల గుర్తులే ఆమె కథలు. ఆ కథాకాశంలో తిరుగుతుంటే ఉండీ ఉండి ఒక దిగులు మేఘమేదో తల మీదుగా వెళ్ళిపోతుంది. అంతలోనే ఆ మబ్బు సందుల్లోంచి సన్నటి వెలుతురు చార ప్రసరిస్తుంది. స్త్రీ - తన జీవితంలో తను లేకపోవడం, తన బ్రతుక్కి తానే పరాయిది కావటం, తనలోకి తను తిరిగి బలంగా ప్రవేశించే ప్రయత్నం చెయ్యటం, ఒక వేదన, ఎరుక, పూనిక - అన్నీ కలిస్తే మల్లీశ్వరి కథలు. అందులో తన ఆశయాన్ని ఆమె మొరటుగా కాక సున్నితంగా సాధించింది.
మల్లీశ్వరి మహా కథా శిల్పం కాదు, గొప్ప వ్యధా శిల్పం. ఈ కథలన్నీ చదువుతుంటే పురుష సమస్తంగా నాలో ఏ మూలనో ఒక అపరాధ భావన పోటమరించింది. బహుశ మల్లీశ్వరి కథా ప్రయోజనం నెరవేరింది.
- డా. పాపినేని శివశంకర్
పదిహేడు గాయాల మాల మల్లీశ్వరి కథా సంపుటి. స్త్రీల హృదయ పత్రాల మీద చెరిగిపోని ఉక్కుపాదాల ముద్రల గుర్తులే ఆమె కథలు. ఆ కథాకాశంలో తిరుగుతుంటే ఉండీ ఉండి ఒక దిగులు మేఘమేదో తల మీదుగా వెళ్ళిపోతుంది. అంతలోనే ఆ మబ్బు సందుల్లోంచి సన్నటి వెలుతురు చార ప్రసరిస్తుంది. స్త్రీ - తన జీవితంలో తను లేకపోవడం, తన బ్రతుక్కి తానే పరాయిది కావటం, తనలోకి తను తిరిగి బలంగా ప్రవేశించే ప్రయత్నం చెయ్యటం, ఒక వేదన, ఎరుక, పూనిక - అన్నీ కలిస్తే మల్లీశ్వరి కథలు. అందులో తన ఆశయాన్ని ఆమె మొరటుగా కాక సున్నితంగా సాధించింది. మల్లీశ్వరి మహా కథా శిల్పం కాదు, గొప్ప వ్యధా శిల్పం. ఈ కథలన్నీ చదువుతుంటే పురుష సమస్తంగా నాలో ఏ మూలనో ఒక అపరాధ భావన పోటమరించింది. బహుశ మల్లీశ్వరి కథా ప్రయోజనం నెరవేరింది. - డా. పాపినేని శివశంకర్© 2017,www.logili.com All Rights Reserved.