"వాక్యమంటే రారా చిన్నన్నా... రారోరి చిన్నవాడ...
అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలుణ్ణి
పిలిచినంత మార్దవంగా ఉండాలి.
నీలం రంగు నిప్పు పువ్వయి ప్రకాశించాలి.
సర్వమూ తానే అయిన వాడిలా వాడిగా లాలించి
పాలించాలి. వనవిల్లు మీద నడిచి మేఘాలలో
తేలినట్టుండాలి. కాలిగ్రఫీ చిత్రాల్లా కళ్ళకు కట్టాలి.
కందర్ప కేతువై ఘనదూమకేతువై చుట్టుముట్టాలి.
యూనిఫామేసుకుని అప్పుడే స్కూలుకొచ్చిన
పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి
నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ కవాతుచెయ్యాలి.
మాటలు ఈటెలూ కత్తులూ.
అవే చురుక్కుమనిపించే చమక్కులు.
మనసుల్ని ముడివేసే మంత్రాలు". - అరుణ పప్పు