ఉమగారు ఒక సామాజిక దృక్పథంతో ఒక సమకాలీక సమస్యను దృష్టిలో పెట్టుకుని రాయడం, వంగూరి ఫౌండేషన్ ఈ పుస్తకాన్ని వెలువరించడం సమాజంలోని కుళ్ళుని తొలగించి యజ్ఞంలో ఒక సమిధను ఆహుతినివ్వడం లాంటిది. ఒక కలిగిన కుటుంబంలో, భాగ్యనగరంలో పెరిగి చిన్న వయసులోనే అమెరికా వచ్చి హ్యూస్టన్ మహానగరంలో స్థిరపడి పోయిన ఉమగారు ఈ నవలలో ఎంచుకున్న నేపథ్యం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది.
చిన్నతనంలోనూ, ప్రస్తుత పరిస్థితులలోనూ తను బయట చూసిన పేద వాతావరణం బహుశా ఆమెకు స్పూర్తినిచ్చి ఉండవచ్చు. కాని ఆమె తీసుకున్న సవాళ్లు నవలను ప్రథమ పురుషలో చెప్పడం, పల్లె జనుల యాస కథనంలో భాగంలో చెయ్యడం, ఎంచుకున్న నేపథ్యానికి తగ్గట్టుగా సందర్భాలను అల్లడం.. ఇవన్నీ మొదటిసారిగా నవల రాస్తున్న కొత్త రచయిత్రికి అంత సులభతరం కాదు. ఆమె చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అయిందో పాఠకులే చెప్పాలి.
- శాయి రాచకొండ
ఉమగారు ఒక సామాజిక దృక్పథంతో ఒక సమకాలీక సమస్యను దృష్టిలో పెట్టుకుని రాయడం, వంగూరి ఫౌండేషన్ ఈ పుస్తకాన్ని వెలువరించడం సమాజంలోని కుళ్ళుని తొలగించి యజ్ఞంలో ఒక సమిధను ఆహుతినివ్వడం లాంటిది. ఒక కలిగిన కుటుంబంలో, భాగ్యనగరంలో పెరిగి చిన్న వయసులోనే అమెరికా వచ్చి హ్యూస్టన్ మహానగరంలో స్థిరపడి పోయిన ఉమగారు ఈ నవలలో ఎంచుకున్న నేపథ్యం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. చిన్నతనంలోనూ, ప్రస్తుత పరిస్థితులలోనూ తను బయట చూసిన పేద వాతావరణం బహుశా ఆమెకు స్పూర్తినిచ్చి ఉండవచ్చు. కాని ఆమె తీసుకున్న సవాళ్లు నవలను ప్రథమ పురుషలో చెప్పడం, పల్లె జనుల యాస కథనంలో భాగంలో చెయ్యడం, ఎంచుకున్న నేపథ్యానికి తగ్గట్టుగా సందర్భాలను అల్లడం.. ఇవన్నీ మొదటిసారిగా నవల రాస్తున్న కొత్త రచయిత్రికి అంత సులభతరం కాదు. ఆమె చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అయిందో పాఠకులే చెప్పాలి. - శాయి రాచకొండ© 2017,www.logili.com All Rights Reserved.