బాల సాహిత్యంలో నూతన వరవడికి కృషి చేస్తున్న వీరు కర్నూలులో జన్మించారు. జానపద కథా సాహిత్యంలో కృషి చేస్తున్న వీరు పల్లెల్లో తిరుగుతూఅంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికి తీస్తూ వాటిని పరిష్కరిస్తూ, తనదైన శైలిలో రచిస్తూ తెలుగు భాషకు అమూల్యమైన సేవ చేస్తున్నారు.
రింగురుబిళ్ళ, కిర్రులొడ్డప్పా, ఒకటి తిందునా రెండుతిందునా, నక్కబావ పిల్లిబావ, నల్లకుక్క నలుగురు మూర్చులు, నాకు మూడు నీకు రెండు, రాయలసీమ జానపద హాస్యకథలు మొ|| పేర్లతో పుస్తకాలు ప్రచురించారు. తెలుగు చదవడం, రాయడం నేర్చుకుంటున్న చిన్నారులకోసం ఒత్తులు లేని గేయాలు, కథలు, బొమ్మలతో సామెతలు, సంయుక్త అక్షరాలు లేని కథలు అనేకం రాసి దాదాపు 20కి పైగా పుస్తకాలు వెలువరించారు.
ఉపాధ్యాయులైన వీరు 'కేతు విశ్వనాథరెడ్డి కథలు - సామాజిక దర్శనం' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కర్నూలు జిల్లా చరిత్రను అమూల్యమైన ఛాయా చిత్రాలతో రూపొందించారు. కొండారెడ్డి బురుజు, కర్నూలు జిల్లా మహనీయుల పుస్తకాలు ప్రచురించారు. 'కర్నూలు కథ' వీరి సంపాదకత్వంలో వెలువడింది. మాయమ్మ రాచ్చసి, మూడు అబద్దాలు, నయాఫత్వా, కందనవోలు కథలు వీరి సామాజిక నిబద్దతను తెలియజేసే కథా సంపుటాలు. బాలల స్వేచ్ఛా ప్రపంచాన్ని కలగంటూ, వారి హక్కులకోసం నినదిస్తూ 'ఒక చల్లని మేఘం' అనే కథల సంపుటి ప్రచురించారు.
బాల సాహిత్యంలో నూతన వరవడికి కృషి చేస్తున్న వీరు కర్నూలులో జన్మించారు. జానపద కథా సాహిత్యంలో కృషి చేస్తున్న వీరు పల్లెల్లో తిరుగుతూఅంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికి తీస్తూ వాటిని పరిష్కరిస్తూ, తనదైన శైలిలో రచిస్తూ తెలుగు భాషకు అమూల్యమైన సేవ చేస్తున్నారు. రింగురుబిళ్ళ, కిర్రులొడ్డప్పా, ఒకటి తిందునా రెండుతిందునా, నక్కబావ పిల్లిబావ, నల్లకుక్క నలుగురు మూర్చులు, నాకు మూడు నీకు రెండు, రాయలసీమ జానపద హాస్యకథలు మొ|| పేర్లతో పుస్తకాలు ప్రచురించారు. తెలుగు చదవడం, రాయడం నేర్చుకుంటున్న చిన్నారులకోసం ఒత్తులు లేని గేయాలు, కథలు, బొమ్మలతో సామెతలు, సంయుక్త అక్షరాలు లేని కథలు అనేకం రాసి దాదాపు 20కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఉపాధ్యాయులైన వీరు 'కేతు విశ్వనాథరెడ్డి కథలు - సామాజిక దర్శనం' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కర్నూలు జిల్లా చరిత్రను అమూల్యమైన ఛాయా చిత్రాలతో రూపొందించారు. కొండారెడ్డి బురుజు, కర్నూలు జిల్లా మహనీయుల పుస్తకాలు ప్రచురించారు. 'కర్నూలు కథ' వీరి సంపాదకత్వంలో వెలువడింది. మాయమ్మ రాచ్చసి, మూడు అబద్దాలు, నయాఫత్వా, కందనవోలు కథలు వీరి సామాజిక నిబద్దతను తెలియజేసే కథా సంపుటాలు. బాలల స్వేచ్ఛా ప్రపంచాన్ని కలగంటూ, వారి హక్కులకోసం నినదిస్తూ 'ఒక చల్లని మేఘం' అనే కథల సంపుటి ప్రచురించారు.© 2017,www.logili.com All Rights Reserved.