హింసపాదుల్లోకి
స్త్రీల మనశ్శరీరాల పై అమలవుతున్న హింస గురించి డా. గీతాంజలి రాసిన కథల మీద నాలుగు మాటలు రాద్దామని కూర్చుంటే నాకు రెండు యిబ్బందులు యెదురయ్యాయి. ఒకటి : వొక సాహిత్య విద్యార్థిగా నేను నేర్చుకున్న బొటాబొటీ భాషా జ్ఞానం నాకు యే మాత్రం తోడ్పడటం లేదు. మరొకటి : జెండర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలకు పైగా యీ నేల మీద స్త్రీవాద విమర్శ అందించిన పరికరాలు కూడా చాలడం లేదు. ఈ పరిమితుల్లోంచీ చేసే అభిప్రాయ వ్యక్తీకరణ యెంత పేలవంగా వుంటుందో తెలిసీ వొకటి రెండు విషయాలు మీతో పంచుకోడానికి సాహసిస్తున్నా. ఆమె అడవిని జయించింది దగ్గర్నుంచీ బచ్చేదానీ పహెచాన్ పాలమూరు వలస బతుకులు దాకా నిబద్ధురాలైన వొక ప్రగతిశీల రచయితగా గీతాంజలి రచనా వ్యాసంగాన్ని దగ్గరగా చూస్తున్నందువల్లే యీ సాహసమైనా. అదీగాక దాదాపు పాతికేళ్ళ స్నేహాన్ని పురస్కరించుకొని కూడా.
'హస్బెండ్ స్టిచ్' పేరుతో గీతాంజలి అందిస్తున్న స్త్రీల లైంగిక విషాద గాథలు విహంగ వెబ్ మాగజైన్లో వస్తున్నప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యాను. స్త్రీ పురుష సంబంధాల గురించి వాటిలో ఆమె లేవనెత్తిన అనేక అంశాలు చాలా ఆలోచింపజేశాయి. కానీ వాటినన్నిటినీ వొక్క చోట యిలా చదవడం మాత్రం దుర్భర వేదనా పూరితమైన............
హింసపాదుల్లోకి ఆడదాని శరీరం మగవాడికి విలాసాల క్రీడా స్థలం అధికార రాజకీయాల కేంద్రం ఆధిపత్య నిరూపణల క్షేత్రం. కానీ... స్త్రీకి ఆమె దేహం ప్రాకృతిక చేతనకు పాదు ఆత్మ గౌరవ ప్రకటనకు పతాక అస్తిత్వ ప్రతిఘటనకు వేదిక. స్త్రీల మనశ్శరీరాల పై అమలవుతున్న హింస గురించి డా. గీతాంజలి రాసిన కథల మీద నాలుగు మాటలు రాద్దామని కూర్చుంటే నాకు రెండు యిబ్బందులు యెదురయ్యాయి. ఒకటి : వొక సాహిత్య విద్యార్థిగా నేను నేర్చుకున్న బొటాబొటీ భాషా జ్ఞానం నాకు యే మాత్రం తోడ్పడటం లేదు. మరొకటి : జెండర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలకు పైగా యీ నేల మీద స్త్రీవాద విమర్శ అందించిన పరికరాలు కూడా చాలడం లేదు. ఈ పరిమితుల్లోంచీ చేసే అభిప్రాయ వ్యక్తీకరణ యెంత పేలవంగా వుంటుందో తెలిసీ వొకటి రెండు విషయాలు మీతో పంచుకోడానికి సాహసిస్తున్నా. ఆమె అడవిని జయించింది దగ్గర్నుంచీ బచ్చేదానీ పహెచాన్ పాలమూరు వలస బతుకులు దాకా నిబద్ధురాలైన వొక ప్రగతిశీల రచయితగా గీతాంజలి రచనా వ్యాసంగాన్ని దగ్గరగా చూస్తున్నందువల్లే యీ సాహసమైనా. అదీగాక దాదాపు పాతికేళ్ళ స్నేహాన్ని పురస్కరించుకొని కూడా. 'హస్బెండ్ స్టిచ్' పేరుతో గీతాంజలి అందిస్తున్న స్త్రీల లైంగిక విషాద గాథలు విహంగ వెబ్ మాగజైన్లో వస్తున్నప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యాను. స్త్రీ పురుష సంబంధాల గురించి వాటిలో ఆమె లేవనెత్తిన అనేక అంశాలు చాలా ఆలోచింపజేశాయి. కానీ వాటినన్నిటినీ వొక్క చోట యిలా చదవడం మాత్రం దుర్భర వేదనా పూరితమైన............© 2017,www.logili.com All Rights Reserved.