ఆ రాత్రి వదిన కాపలా కాసింది. తన మీదకు ఒక మనిషిలా కాదు బురదలో పాకుతున్న గొంగళి పురుగు లాగా పాకాడు. నోటి నుంచి కారుతున్న చొంగతో తన పెదాలు, నోరు మొఖాన్ని తను తిరస్కరిస్తున్న కొద్దీ.... తడిపేసాడు. భరించలేని వాసన..... అతని ఒంటిమీద పుండ్లు చిట్లి ఆ రసి తనకు అంటుకుంటుంటే, భయం వెన్నులోంచి జరా జరా పాకి ప్రాణ భయంతో, అతని డొక్కలో తన్ని లేచి ముందు గదిలో అడ్డంగా పడుకుని, సాదికి లేచి తన్ని చూసి నిర్ఘాంత పోయి, కాలు పట్టుకో బోయిన ఒదినని విదిల్చి బలంగా ఒక్క తప్పు తన్ని, తలుపు తీసుకుని రోడ్డు మీదకి అదే పరుగు.... ఒళ్ళంతా చెమటతో తడిసి, తలంతా రేగి పోయి కన్నీళ్ళతో చెంపలు తడిచి, కోపంతో హృదయం పగిలి, రగిలి పోతుంటే పంజరం తలుపు తెరుచుకున్న రామ చిలుక స్వేచ్ఛనందము, భయము కలగలిసి రయ్యిన ఆకాశంలోకి దూసుకు పోతున్నట్లు కళావతి, తనకే తెలీని ఒక వింత ఆనందాన్ని కూడా అనుభవించింది.
- గీతాంజలి