రియల్ ఎస్టేట్
హైదరాబాద్ మహా నగరంలో సొంత ఇల్లు ఉండటం అనేది కలలో కూడా ఊహించలేకపోతున్నాము. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అయింది. ఈ మధ్యకాలంలో భూముల విలువలకు రెక్కలు వచ్చి చుక్కల వలె ఆకాశంలో ఉ న్నాయి. గత సంవత్సరం కొన్న ప్లాటు ధర ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ పలుకుతుంది.
మా ఆఫీసులో శంకరయ్య అనే క్లాస్ ఫోర్ ఉద్యోగి ఉన్నాడు. చేసేది చిన్న ఉ ద్యోగమే అయినా సైడు బిజినెసులు చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. పైసలు వడ్డీలకు ఇస్తూ ఉంటాడు. ఈ బిజినెస్ లన్నీ భార్యపేరునే చేస్తున్నాడు. ఇన్కామాక్స్ పైసా కూడా కట్టడు.
శంకరయ్య తనకు తెలిసిన వ్యక్తి ద్వారా మా ఆఫీసులో కొంతమంది చేత నాలుగు సంవత్సరాల క్రితం చవకలో ఇంటి స్థలాలు కొనిపించాడు. ఇప్పుడు ఆ ఏరియా బాగా డెవలప్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా దగ్గరలో ఉన్నది.
చాలా రోజుల క్రితం నేను వెళ్ళి చూశాను. డెవలప్ అయిన తర్వాత చూడలేదు. ఒకరోజు వీలు చూసుకొని మా కొలీగ్ బాలచెన్నారెడ్డి, నేను ప్లాటు చూడటానికి వెళ్ళాము. మేము కొన్న భూమిలో సరిహద్దు రాళ్ళు పీకివేసి పంట సాగుచేశారు. మాకు ఆశ్చర్యం, బాధా కలిగాయి. అక్కడ పక్కవారినడిగితే ఎవరూ సరిగా సమాధానం చెప్పలేదు.
మరుసటి రోజు శంకరయ్యను నిలదీసి గట్టిగా అడిగాము. "నిన్ను చూసి కొన్నాము, ఇప్పుడు ఇలా అయ్యింది" అని...................
రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మహా నగరంలో సొంత ఇల్లు ఉండటం అనేది కలలో కూడా ఊహించలేకపోతున్నాము. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అయింది. ఈ మధ్యకాలంలో భూముల విలువలకు రెక్కలు వచ్చి చుక్కల వలె ఆకాశంలో ఉ న్నాయి. గత సంవత్సరం కొన్న ప్లాటు ధర ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ పలుకుతుంది. మా ఆఫీసులో శంకరయ్య అనే క్లాస్ ఫోర్ ఉద్యోగి ఉన్నాడు. చేసేది చిన్న ఉ ద్యోగమే అయినా సైడు బిజినెసులు చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. పైసలు వడ్డీలకు ఇస్తూ ఉంటాడు. ఈ బిజినెస్ లన్నీ భార్యపేరునే చేస్తున్నాడు. ఇన్కామాక్స్ పైసా కూడా కట్టడు. శంకరయ్య తనకు తెలిసిన వ్యక్తి ద్వారా మా ఆఫీసులో కొంతమంది చేత నాలుగు సంవత్సరాల క్రితం చవకలో ఇంటి స్థలాలు కొనిపించాడు. ఇప్పుడు ఆ ఏరియా బాగా డెవలప్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా దగ్గరలో ఉన్నది. చాలా రోజుల క్రితం నేను వెళ్ళి చూశాను. డెవలప్ అయిన తర్వాత చూడలేదు. ఒకరోజు వీలు చూసుకొని మా కొలీగ్ బాలచెన్నారెడ్డి, నేను ప్లాటు చూడటానికి వెళ్ళాము. మేము కొన్న భూమిలో సరిహద్దు రాళ్ళు పీకివేసి పంట సాగుచేశారు. మాకు ఆశ్చర్యం, బాధా కలిగాయి. అక్కడ పక్కవారినడిగితే ఎవరూ సరిగా సమాధానం చెప్పలేదు. మరుసటి రోజు శంకరయ్యను నిలదీసి గట్టిగా అడిగాము. "నిన్ను చూసి కొన్నాము, ఇప్పుడు ఇలా అయ్యింది" అని...................© 2017,www.logili.com All Rights Reserved.