అఖండ భారతం
రామశర్మ ఆయుర్వేద వైద్యుడు. ఎంతటి మొండి వ్యాధినైనా ఇట్టే తగ్గించగల మంచి నైపుణ్యము, హస్తవాసి గల వ్యక్తి. పట్నానికి దూరంగా ఉ చిన్న చిన్న పల్లెటూరులో అతని నివాసం. ఆ ఊరులోని ప్రజలే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చి తమ అనారోగ్యాలకు మందులు తీసుకొనేవారు.
తన ఊరికి సమీపంలో ఉన్న అడవిలోకి పోయి అక్కడ నుంచి వనమూలికలు సేకరించి తీసుకొని వచ్చి పుటం పెట్టి గుళికలు, ద్రవాలు తయారుచేసి వాటితో వైద్యం చేస్తుంటాడు. ఒక రోజు రామశర్మ అడవికి బయలు దేరుతుండే భార్య దయమంతి ఇలా అన్నది.
"ఏమండీ! మన అబ్బాయి సుబ్రహ్మణ్యశర్మ కు కాలేజీ ఫీజు కట్టాలి. మన కూతురు గాయత్రికి ఏలూరు సంబంధము వారు తమ ఇష్టం తెలియపరిచారట. నిన్ననే నేట్లో చూసి మన సుబ్బు చెప్పాడు.”
“నిన్న రాత్రి కోమటి బాపిశెట్టి గారి దగ్గర నుంచి కావలసిన పైకం మొత్తం తెచ్చి బీరువాలో పెట్టాను. వనమూలికలు తీసుకొన్ని సాయంత్రానికి ఇంటికి వస్తాను. రేపు ఉదయమే మన కొడుకు కాలేజీ ఫీజుకట్టి, మధ్యాహ్నం ఏలూరు పోయి పెళ్ళి చూపులకు వారిని ఆహ్వానించివస్తాను సరేనా! నీవు అనవసరంగా ఆందోళన చెందకు” అని భార్యతో చెప్పి పెద్ద చేతి సంచీ తీసుకొని అడవికి బయలు దేరాడు రామశర్మ.
తనకు అలవాటైన అడవిదారి కనుక త్వరత్వరగా రామశర్మ నడవసాగాడు. కొండలు కోనలు లోయలు గుహలలో తిరుగుతూ కావలసిన మూలికలు, కాయలు, వృక్షముల వేళ్ళు, చెట్ల బెరడులు, ఆకులు సేకరించుకొని సంచీలో వేసుకొన్నాడు. మధ్యాహ్నం తను తెచ్చుకొన్న అన్నం తిన్నాడు. క్రూరమృగాలు తిరిగే అడవి ప్రాంతం. అందుకని ఎత్తైన పెద్ద...............
శ్రీ జన్నాభట్ల నరసింహప్రసాద్
అఖండ భారతం రామశర్మ ఆయుర్వేద వైద్యుడు. ఎంతటి మొండి వ్యాధినైనా ఇట్టే తగ్గించగల మంచి నైపుణ్యము, హస్తవాసి గల వ్యక్తి. పట్నానికి దూరంగా ఉ చిన్న చిన్న పల్లెటూరులో అతని నివాసం. ఆ ఊరులోని ప్రజలే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చి తమ అనారోగ్యాలకు మందులు తీసుకొనేవారు. తన ఊరికి సమీపంలో ఉన్న అడవిలోకి పోయి అక్కడ నుంచి వనమూలికలు సేకరించి తీసుకొని వచ్చి పుటం పెట్టి గుళికలు, ద్రవాలు తయారుచేసి వాటితో వైద్యం చేస్తుంటాడు. ఒక రోజు రామశర్మ అడవికి బయలు దేరుతుండే భార్య దయమంతి ఇలా అన్నది. "ఏమండీ! మన అబ్బాయి సుబ్రహ్మణ్యశర్మ కు కాలేజీ ఫీజు కట్టాలి. మన కూతురు గాయత్రికి ఏలూరు సంబంధము వారు తమ ఇష్టం తెలియపరిచారట. నిన్ననే నేట్లో చూసి మన సుబ్బు చెప్పాడు.” “నిన్న రాత్రి కోమటి బాపిశెట్టి గారి దగ్గర నుంచి కావలసిన పైకం మొత్తం తెచ్చి బీరువాలో పెట్టాను. వనమూలికలు తీసుకొన్ని సాయంత్రానికి ఇంటికి వస్తాను. రేపు ఉదయమే మన కొడుకు కాలేజీ ఫీజుకట్టి, మధ్యాహ్నం ఏలూరు పోయి పెళ్ళి చూపులకు వారిని ఆహ్వానించివస్తాను సరేనా! నీవు అనవసరంగా ఆందోళన చెందకు” అని భార్యతో చెప్పి పెద్ద చేతి సంచీ తీసుకొని అడవికి బయలు దేరాడు రామశర్మ. తనకు అలవాటైన అడవిదారి కనుక త్వరత్వరగా రామశర్మ నడవసాగాడు. కొండలు కోనలు లోయలు గుహలలో తిరుగుతూ కావలసిన మూలికలు, కాయలు, వృక్షముల వేళ్ళు, చెట్ల బెరడులు, ఆకులు సేకరించుకొని సంచీలో వేసుకొన్నాడు. మధ్యాహ్నం తను తెచ్చుకొన్న అన్నం తిన్నాడు. క్రూరమృగాలు తిరిగే అడవి ప్రాంతం. అందుకని ఎత్తైన పెద్ద............... శ్రీ జన్నాభట్ల నరసింహప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.