ఈ 'కాల ప్రవాహం' సంపుటిలోని కథలు గతంలో అనేక పత్రికలలో అచ్చయినప్పుడే నేను చదివాను. వివిధ కోణాల్లోకి కథాంశాలకు హృద్యమంగా రచించిన తమిళ రచయితలను మనం ముందుగా మనస్ఫూర్తిగా అభినందించాలి. డిక్టేటివ్, సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా రాసి పేరుపొందిన తమిళ రచయిత 'రంగరాజన్' గారి రచన 'కుందేళ్ళు' కథ కూడా ఇందులో ఉంది. శాస్త్రవేత్తలు సాధారణంగా ఎలుకలు, కప్పలు, కుందేళ్ళు వంటి మూగజీవాలపై పరిశోధనలు చేస్తుంటారు. వాళ్ళు తయారుచేసిన మందులను వాటిపై ప్రయోగించినప్పుడు అవి ఎంతగా నరకయాతన అనుభావిస్తున్నాయో తెలిపేదే 'కుందేళ్ళు' కథ.
పేదవాళ్ళకు మనం సాయం చేయాలనుకున్నా వాళ్ళలో వాళ్ళే అడ్డుపడే విధానం, మన నుండి సాయం పొందడానికి కూడా వాళ్లకు కొన్ని నిర్బందాలు అడ్డుతగులుతాయని తెలియజేస్తుంది 'నిబంధన' కథ. తన ఇంటిమీది మమకారంతో తన ఇంటిని, వారసులు ఎక్కడ అమ్ముకుంటారోనన్న బెంగతో - పిల్లలు విదేశాలకు వెళ్లి స్థిరపడినా, వాళ్ళు రమ్మని పిలిచినా వెళ్ళడానికి ఇష్టపడక ఆ ఇంట్లోనే ఉండిపోయిన ఓ సగటు మనిషి జీవితమే 'కాల ప్రవాహం' కథ. ఇలా ఈ పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన కథలు కలవు.
- పేరూరు బాలసుబ్రహ్మణ్యం
ఈ 'కాల ప్రవాహం' సంపుటిలోని కథలు గతంలో అనేక పత్రికలలో అచ్చయినప్పుడే నేను చదివాను. వివిధ కోణాల్లోకి కథాంశాలకు హృద్యమంగా రచించిన తమిళ రచయితలను మనం ముందుగా మనస్ఫూర్తిగా అభినందించాలి. డిక్టేటివ్, సైన్స్ ఫిక్షన్ ఎక్కువగా రాసి పేరుపొందిన తమిళ రచయిత 'రంగరాజన్' గారి రచన 'కుందేళ్ళు' కథ కూడా ఇందులో ఉంది. శాస్త్రవేత్తలు సాధారణంగా ఎలుకలు, కప్పలు, కుందేళ్ళు వంటి మూగజీవాలపై పరిశోధనలు చేస్తుంటారు. వాళ్ళు తయారుచేసిన మందులను వాటిపై ప్రయోగించినప్పుడు అవి ఎంతగా నరకయాతన అనుభావిస్తున్నాయో తెలిపేదే 'కుందేళ్ళు' కథ. పేదవాళ్ళకు మనం సాయం చేయాలనుకున్నా వాళ్ళలో వాళ్ళే అడ్డుపడే విధానం, మన నుండి సాయం పొందడానికి కూడా వాళ్లకు కొన్ని నిర్బందాలు అడ్డుతగులుతాయని తెలియజేస్తుంది 'నిబంధన' కథ. తన ఇంటిమీది మమకారంతో తన ఇంటిని, వారసులు ఎక్కడ అమ్ముకుంటారోనన్న బెంగతో - పిల్లలు విదేశాలకు వెళ్లి స్థిరపడినా, వాళ్ళు రమ్మని పిలిచినా వెళ్ళడానికి ఇష్టపడక ఆ ఇంట్లోనే ఉండిపోయిన ఓ సగటు మనిషి జీవితమే 'కాల ప్రవాహం' కథ. ఇలా ఈ పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన కథలు కలవు. - పేరూరు బాలసుబ్రహ్మణ్యం© 2017,www.logili.com All Rights Reserved.