డబ్బు అంటే ఏమిటి?
'డబ్బు' ఇది ఏమాత్రం పరిచయం అవసరంలేని పదం. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ (ఆత్మజ్ఞానులు తప్ప మిగిలిన అందరూ కొంచెం ఎక్కువగానో, తక్కువగానో అందరూ డబ్బుకోసం పరుగులు పెట్టేవారే, ప్రయత్నం చేసేవారే, చింతించేవారే.
మరి అందర్నీ ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ డబ్బు గురించి మనకు తెలుసా? అసలు 'డబ్బు' అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటో
"ఇది కూడా ఒక ప్రశ్నేనా... డబ్బంటే ఏంటో తెలీదా" అని అనుకుంటున్నారా? అయితే చెప్పండి.
దీనికి వివిధ రకాల సమాధానాలు రావచ్చు. ఎవరి జవాబు ఎలా ఉన్నా, మనలో చాలామందికి 'డబ్బు' అంటే ఏమిటో స్పష్టంగా తెలీదు. విచిత్రమేమిటంటే, మనకు తెలియదని కూడా మనకు తెలీదు! 'డబ్బు' అంటే ఏమిటో మనకు సరిగా అర్థంకాకపోయినా, మనకు తెలుసుననే భ్రమలో దానివెనక దానికోసం పరుగులు పెడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఇన్ని తంటాలు!
సరే, మళ్ళీ మన ప్రశ్న దగ్గరకొద్దాం. డబ్బు అంటే ఏమిటి? సాధారణంగా చాలామంది అనుకునేది, డబ్బంటే మనం రోజూ చూసే (లేదా) ఖర్చుపెట్టే కాగితపు డబ్బు లేదా నాణేలు అని. కానీ అది డబ్బు కాదు! దానిని “కరెన్సీ (Currency)” అంటారు. లేదా ద్రవ్యము, నగదు అని అంటారు. అయితే మరి డబ్బు అంటే ఏమిటి?
వివిధ స్థాయిలలో డబ్బు యొక్క అసలైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఊహాత్మక కథ సహాయంతో మన ప్రయత్నం మొదలు పెడదాం.
బాగా ధనవంతుడైన ఒక కోటీశ్వరుడున్నాడనుకుందాం. అతను ఒకసారి వ్యాపారరీత్యా ఏ అండమాన్ నికోబర్ దీవులకో వెళ్ళాడు అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. తిరిగి బయలుదేరేటప్పుడు హోటల్ బిల్ కట్టడానికి తన క్రెడిట్ కార్డును ఉపయోగించాడు. అయితే ఏదో సాంకేతిక లోపం వల్ల (because of some technical problem) అక్కడ అప్పుడు ఎలాంటి లావాదేవీ యంత్రాలు............
డబ్బు అంటే ఏమిటి? 'డబ్బు' ఇది ఏమాత్రం పరిచయం అవసరంలేని పదం. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ (ఆత్మజ్ఞానులు తప్ప మిగిలిన అందరూ కొంచెం ఎక్కువగానో, తక్కువగానో అందరూ డబ్బుకోసం పరుగులు పెట్టేవారే, ప్రయత్నం చేసేవారే, చింతించేవారే. మరి అందర్నీ ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ డబ్బు గురించి మనకు తెలుసా? అసలు 'డబ్బు' అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏమిటో "ఇది కూడా ఒక ప్రశ్నేనా... డబ్బంటే ఏంటో తెలీదా" అని అనుకుంటున్నారా? అయితే చెప్పండి. దీనికి వివిధ రకాల సమాధానాలు రావచ్చు. ఎవరి జవాబు ఎలా ఉన్నా, మనలో చాలామందికి 'డబ్బు' అంటే ఏమిటో స్పష్టంగా తెలీదు. విచిత్రమేమిటంటే, మనకు తెలియదని కూడా మనకు తెలీదు! 'డబ్బు' అంటే ఏమిటో మనకు సరిగా అర్థంకాకపోయినా, మనకు తెలుసుననే భ్రమలో దానివెనక దానికోసం పరుగులు పెడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఇన్ని తంటాలు! సరే, మళ్ళీ మన ప్రశ్న దగ్గరకొద్దాం. డబ్బు అంటే ఏమిటి? సాధారణంగా చాలామంది అనుకునేది, డబ్బంటే మనం రోజూ చూసే (లేదా) ఖర్చుపెట్టే కాగితపు డబ్బు లేదా నాణేలు అని. కానీ అది డబ్బు కాదు! దానిని “కరెన్సీ (Currency)” అంటారు. లేదా ద్రవ్యము, నగదు అని అంటారు. అయితే మరి డబ్బు అంటే ఏమిటి? వివిధ స్థాయిలలో డబ్బు యొక్క అసలైన అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఊహాత్మక కథ సహాయంతో మన ప్రయత్నం మొదలు పెడదాం. బాగా ధనవంతుడైన ఒక కోటీశ్వరుడున్నాడనుకుందాం. అతను ఒకసారి వ్యాపారరీత్యా ఏ అండమాన్ నికోబర్ దీవులకో వెళ్ళాడు అక్కడ ఒక హోటల్లో బస చేశాడు. తిరిగి బయలుదేరేటప్పుడు హోటల్ బిల్ కట్టడానికి తన క్రెడిట్ కార్డును ఉపయోగించాడు. అయితే ఏదో సాంకేతిక లోపం వల్ల (because of some technical problem) అక్కడ అప్పుడు ఎలాంటి లావాదేవీ యంత్రాలు............© 2017,www.logili.com All Rights Reserved.