నాకు సంస్కృతం రాదు. తెలుగు కావ్యాలు ఎక్కువగా చదవలేదు. మంచి మంచి పద్యాలు నోటికి రావు. తెలిసిన పద్యాలు కూడా గబుక్కున ఎక్కడివో ఎవరివో చెప్పలేను. కవిత్వం చదివి, ఆస్వాదించడం మాత్రమే తెలుసు. కాళ్ళు భూమ్మీద ఆనించుకుని స్థిరంగా నిలబడడంకోసం ఆరాటపడిన కలం మాది, కావ్యాలు కవిత్వాలు చదివి వాటిలోని సొబగు సౌందర్యాలు ఆకళింపు చేసుకునే వెసులుబాటు లేని తనంలో జీవితంలోని నాణ్యమైన కాలం గడిచిపోయిన సందర్భం మాది.ఈ పిల్ల చూడబోతే బాగా చదువు వచ్చిన పిల్ల. ఇంజినీరింగ్తో పాటు డొక్కశుద్దిగా సాహిత్యం చదివిన పిల్ల. లోకాన్ని చూస్తూ అర్ధం చేసుకుంటున్న పిల్ల. మరెందుకీ గౌరవం అందుకునే సాహసం నాకు, అంటే......
నాకు కవిత్వం అంటే గౌరవం. కథలంటే ప్రేమ. హాస్య వ్యంగ్య జీవన చిత్రాలంటే మక్కువ. పిల్లల్ని గౌరవంగా చూస్తూ, గారం చేసే తల్లులంటే ఇష్టం. తమ పిల్లల పసితనంలోని అమాయకవిత్వంలో కనపడకుండా దాక్కున్న కళ్ళు చెదిరే తెలివి, సమయోచిత సంభాషణలకి అబ్బురపడి ఆ అబ్బురాన్ని పదిమందికి పంచి ఆనందించే చిట్టితల్లులని గుండెకి హత్తుకోవాలనిపిస్తు వుంటుంది.
-పాలపర్తి ఇంద్రాణి.