ఒంటరి మనిషి...
ఎంత దూరం నడిచినా
వెచ్చని ఇల్లు దాపులో కనిపించదు
దట్టమైన చీకటి తెర
దారిని మూసి వేస్తుంది.
జోరుగా వీచే శీతగాలి
జుట్టుని చెదరగొడుతుంది.
ఎంత దూరం నడిచినా
నిప్పు సెగ జాడే కనిపించదు
చల్లని మంచుగాలి
చెళ్ళని కొడుతుంది.
కరకరమని మంచుపొడి
కాళ్ళ కింద కరిగిపోతుంది.
ఎంత దూరం నడిచినా
వెచ్చని భోజనం వాసనే సోకదు
చుట్టూ పరుచుకున్న మంచుగుట్ట
చచ్చేంత ఆకలి పుట్టిస్తుంది
ఒళ్ళు విరుచుకున్న మంచుపులి
ఒంటరి బాటసారిని ఆబగా వెంటాడుతుంది.
ఒంటరి మనిషి... ఎంత దూరం నడిచినా వెచ్చని ఇల్లు దాపులో కనిపించదు దట్టమైన చీకటి తెర దారిని మూసి వేస్తుంది. జోరుగా వీచే శీతగాలి జుట్టుని చెదరగొడుతుంది. ఎంత దూరం నడిచినా నిప్పు సెగ జాడే కనిపించదు చల్లని మంచుగాలి చెళ్ళని కొడుతుంది. కరకరమని మంచుపొడి కాళ్ళ కింద కరిగిపోతుంది. ఎంత దూరం నడిచినా వెచ్చని భోజనం వాసనే సోకదు చుట్టూ పరుచుకున్న మంచుగుట్ట చచ్చేంత ఆకలి పుట్టిస్తుంది ఒళ్ళు విరుచుకున్న మంచుపులి ఒంటరి బాటసారిని ఆబగా వెంటాడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.