ఒకానొక విషాణువు కల్పించిన జీవన్మరణ సంధిలో, సంక్షోభంలో, మూడు దశాబ్దాల కథాసాహితి వేసిన మజిలీ ఇది. కరాళ కాలం , ఇది కంకాళ కాలం. ఇప్పుడు, మనకు మానవ సంబంధాలు సరికొత్తగా అర్ధం అవుతున్నాయి. పాత నమ్మకాలు ,విలువలు ఎన్నో గాలికి కొట్టుకుపోతున్నాయి. విచ్చలవిడిగా ప్రకృతి పై దండెత్తిన మానిషి, తిరిగి అదే ప్రకృతి అన్నిటిని సమం చేస్తుంటే ఇప్పుడు ఏకాంత అంధకార గుహలో బిక్కుబిక్కుమంటున్నాడు . ప్రకృతి - మనిషి - సమాజం అనే త్రికం గురించి, అందులో మన సంబంధాల గురించి తాత్త్వికంగా తరచి తరచి తలపోయాల్సిన సందర్భం. ఆ సందర్భాన్ని ఈ బృహత్ సంకలనం అన్యాపదేశంగా గుర్తుచేస్తుంది.