ఆ రాత్రి... ఆ పాట....
కడప నేకనామ్ కళాక్షేత్రంలో అడుగుపెట్టేంతవరకు నాకే తెలియదు -నాలో వస్తు'తో పడివుండిన కళారాధన అంతగా చెలరేగిపోతుందని.
హైదరాబాదు నుంచి నా చిరకాల ఆత్మీయ మిత్రుడు అభిషేక్ - అదే పనిగా ఆ మ్యూజికల్ నైట్ కి వచ్చానని చెప్పి - నన్ను బయలుదేరిపించాడు. ఆ రాత్రి భోం చేయడానికి కూర్చోబోతున్న నన్ను వద్దని తన కారులో బయటికి తీసుకునిపోయాడు - బయటే భౌం చేద్దామని.
రాత్రి పది గంటల పది నిమిషాలు అవుతుంటే కళాక్షేత్రం కేసి బయల్దేరినాము -
ఈ కడపలో ఓ అయిదారు గ్రూపులు పిల్లోళ్ళు వున్నారు. ఒకొక్కరు ఒకో పేర్తో మ్యూజికల్ ఆర్కెస్ట్రా నడుపుతున్నారు. వాళ్ళంతా స్టేజీ ప్రోగ్రామ్స్ యిచ్చి బతుకులు సాగించే వృత్తి గాయకులు కానేకారు. బతుకు తెరువు కోసం ఏ సైకిల్ షాపో, ఏమోటారు మెకానిక్ షాపో, ఏ కూరగాయల అంగడో, ఏ టైలరింగ్ షాపో, ఏ స్వీటు షాపో, ఏ పచారీ అంగడో నిర్వహించేవాళ్ళే వాళ్ళు. కొందరైతే టీ అంగళ్ళు నడిపేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మాత్రం - పాటలు పాడటంలో ఆరితేరిన వాళ్ళు. ఘంటసాల, కిషోర్‌కుమార్, మహమ్మద్ రఫీ, ఇలా ఎవరో ఒక సంగీత కళాకారుల జయంతి, వర్గంతులకు కళాక్షేత్రంలో మ్యూజికల్ నైట్స్ జరిపిస్తారు. కర్నూలు నుంచో, నెల్లూరు నుంచో ఆర్కెస్ట్రా బాడుగకు రప్పిస్తారు. లేడీ సింగర్స్ మాత్రం మద్రాసు, హైదరాబాద్ నుంచి పిలిపిస్తారు.
ఈ ప్రోగ్రామ్స్ జరిపించడానికి ఎవరు విరాళాలు యిస్తారో ఏమో - ప్రోగ్రామ్స్ మాత్రం గొప్పగా చేస్తారు. ఈ రోజు ప్రోగ్రామ్ 'జుగను' ఆర్కెస్ట్రా వాళ్ళు అరేంజ్ చేశారు. అభిషేక్ ని ఆహ్వానించారు. ఎన్ని పనులున్నా ఈయన వదిలేసి వస్తాడు. పాత వాసన ఎక్కడికి పోతుంది. అభిషేక్ పాత నటుడు, గాయకుడు కూడా. ఇప్పుడు ఇతర ఏ రంగంలో ఎలా జీవిస్తున్నా | ఆయనలోని కళాజీవిని చంపుకోడు. అందుకే ఆయన మొహంలో కాని ప్రవర్తనలో కానీ ఎక్కడా |
టెన్షన్ అనేది వుండదు................
ఆ రాత్రి... ఆ పాట.... కడప నేకనామ్ కళాక్షేత్రంలో అడుగుపెట్టేంతవరకు నాకే తెలియదు -నాలో వస్తు'తో పడివుండిన కళారాధన అంతగా చెలరేగిపోతుందని. హైదరాబాదు నుంచి నా చిరకాల ఆత్మీయ మిత్రుడు అభిషేక్ - అదే పనిగా ఆ మ్యూజికల్ నైట్ కి వచ్చానని చెప్పి - నన్ను బయలుదేరిపించాడు. ఆ రాత్రి భోం చేయడానికి కూర్చోబోతున్న నన్ను వద్దని తన కారులో బయటికి తీసుకునిపోయాడు - బయటే భౌం చేద్దామని. రాత్రి పది గంటల పది నిమిషాలు అవుతుంటే కళాక్షేత్రం కేసి బయల్దేరినాము - ఈ కడపలో ఓ అయిదారు గ్రూపులు పిల్లోళ్ళు వున్నారు. ఒకొక్కరు ఒకో పేర్తో మ్యూజికల్ ఆర్కెస్ట్రా నడుపుతున్నారు. వాళ్ళంతా స్టేజీ ప్రోగ్రామ్స్ యిచ్చి బతుకులు సాగించే వృత్తి గాయకులు కానేకారు. బతుకు తెరువు కోసం ఏ సైకిల్ షాపో, ఏమోటారు మెకానిక్ షాపో, ఏ కూరగాయల అంగడో, ఏ టైలరింగ్ షాపో, ఏ స్వీటు షాపో, ఏ పచారీ అంగడో నిర్వహించేవాళ్ళే వాళ్ళు. కొందరైతే టీ అంగళ్ళు నడిపేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మాత్రం - పాటలు పాడటంలో ఆరితేరిన వాళ్ళు. ఘంటసాల, కిషోర్‌కుమార్, మహమ్మద్ రఫీ, ఇలా ఎవరో ఒక సంగీత కళాకారుల జయంతి, వర్గంతులకు కళాక్షేత్రంలో మ్యూజికల్ నైట్స్ జరిపిస్తారు. కర్నూలు నుంచో, నెల్లూరు నుంచో ఆర్కెస్ట్రా బాడుగకు రప్పిస్తారు. లేడీ సింగర్స్ మాత్రం మద్రాసు, హైదరాబాద్ నుంచి పిలిపిస్తారు. ఈ ప్రోగ్రామ్స్ జరిపించడానికి ఎవరు విరాళాలు యిస్తారో ఏమో - ప్రోగ్రామ్స్ మాత్రం గొప్పగా చేస్తారు. ఈ రోజు ప్రోగ్రామ్ 'జుగను' ఆర్కెస్ట్రా వాళ్ళు అరేంజ్ చేశారు. అభిషేక్ ని ఆహ్వానించారు. ఎన్ని పనులున్నా ఈయన వదిలేసి వస్తాడు. పాత వాసన ఎక్కడికి పోతుంది. అభిషేక్ పాత నటుడు, గాయకుడు కూడా. ఇప్పుడు ఇతర ఏ రంగంలో ఎలా జీవిస్తున్నా | ఆయనలోని కళాజీవిని చంపుకోడు. అందుకే ఆయన మొహంలో కాని ప్రవర్తనలో కానీ ఎక్కడా | టెన్షన్ అనేది వుండదు................© 2017,www.logili.com All Rights Reserved.