అత్తయ్య
"ఏం? ఈ రోజు బ్యాంకీ లేదా?”
"లేదు సార్. ఇవ్వాళ మహాశివరాత్రి; శెలవు గాదటండీ?”
చెక్కు మార్చుకుని రావాలని రిజర్వు బ్యాంకికీ వెళ్తే గేటులోనే చెప్పాడు వాచ్మన్.
మహాశివరాత్రి! మహాశివరాత్రి! నా హృదయం కంపించిపోతూంది. భయంకరంగా వినిపిస్తూన్న సముద్రుడి ఘోషకు పదిహేను సంవత్సరాల జీవితానుభవాల తాలూకు చీకటి ముసుగులు చెరిగిపోతున్నాయ్. ఉవ్వెత్తుగా లేచి పడ్తున్న కెరటాలు ఉప్పొంగి వస్తూన్న మధురస్మృతుల్ని రెచ్చకొడ్తున్నాయ్. నిర్మలమైన వినీలాకాశపు హృదయంలోకి నల్లటి పొగను. విడుస్తూ, హార్బరులో ఉన్న నౌకల తాలూకు చిమ్నీలు ఏటవాలుగా తొంగి చూస్తున్నాయ్. హార్బరు రోడ్డు నుంచి పారిస్ కార్నర్ మలుపు తిరిగాను. ఎదురుగా హైకోర్టు న్యాయస్థూపం, లైట్ హౌస్ విడిపోతూన్న తెల్లటి మబ్బు తునకల్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాయ్.
ప్రక్కనే, ఆరంతస్థుల ప్యారిస్ బిల్డింగ్ భూతంలా మీదకు విరుచుకుపడ్తూన్నట్టుగా ఉంది! ఆ వాతావరణంలో భౌతికంగానూ మానసికంగానూ, ఎంతో చిన్నవాణ్ణయి పోతున్నట్టుగా అనిపించింది. మలుపు తిరుగుతూ ట్రాం- 'గర్-గర్'మని చేస్తూన్న ధ్వనికి నా స్మృతిపథంలో పదిహేను సంవత్సరాలుగా, చలనరహితంగా పడి ఉన్న రంగులరాట్నం కదిలింది. 'బర్-బర్'
గిర్రున తిరిగిపోతుంది - గుర్రం, ఏనుగూ, ఉయ్యాలా, ఒంటె, విమానం రయ్యిన తిరిగిపోతున్నాయ్. కోరీ మీద తిరునాళ్ళో తిరుగుతున్న రంగుల రాట్నాన్ని చిత్రంగా చూస్తూ మాణిక్కాం పక్కన నుంచున్న నేనూ, నా ఆరేళ్ళ వయస్సూ, పొట్టి లాగూ, కొత్త చొక్కా, ఏడున్నరణాల చిల్లరా.... మళ్ళీ నాకొచ్చేసినయ్.
"అమ్మగోరూ! అబ్బాయిగార్ని నా యెంట పంపండీ?"
"అయితే, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తావా?"
"ఓ! నా సంగతి మీకు తెలవదాండీ అమ్మగోరూ!"
"ఏం రా, అబ్బాయ్! మాణిక్కాం వెంట వెళ్తావా?" అమ్మ అడిగీ అడగడంతోటే తల గిర్రున ఊపేశాను. తిరునాళ్ళకు వెళ్ళాలని కొండంత ఆశతో కూర్చున్న నాకు మాణిక్యాం తనతో తీసుకెళ్తాననగానే ఎంతో సంతోషం కలిగింది. పని మనిషి మాణిక్కాంమీద నా కంతవరకూ.......................
అత్తయ్య "ఏం? ఈ రోజు బ్యాంకీ లేదా?” "లేదు సార్. ఇవ్వాళ మహాశివరాత్రి; శెలవు గాదటండీ?” చెక్కు మార్చుకుని రావాలని రిజర్వు బ్యాంకికీ వెళ్తే గేటులోనే చెప్పాడు వాచ్మన్. మహాశివరాత్రి! మహాశివరాత్రి! నా హృదయం కంపించిపోతూంది. భయంకరంగా వినిపిస్తూన్న సముద్రుడి ఘోషకు పదిహేను సంవత్సరాల జీవితానుభవాల తాలూకు చీకటి ముసుగులు చెరిగిపోతున్నాయ్. ఉవ్వెత్తుగా లేచి పడ్తున్న కెరటాలు ఉప్పొంగి వస్తూన్న మధురస్మృతుల్ని రెచ్చకొడ్తున్నాయ్. నిర్మలమైన వినీలాకాశపు హృదయంలోకి నల్లటి పొగను. విడుస్తూ, హార్బరులో ఉన్న నౌకల తాలూకు చిమ్నీలు ఏటవాలుగా తొంగి చూస్తున్నాయ్. హార్బరు రోడ్డు నుంచి పారిస్ కార్నర్ మలుపు తిరిగాను. ఎదురుగా హైకోర్టు న్యాయస్థూపం, లైట్ హౌస్ విడిపోతూన్న తెల్లటి మబ్బు తునకల్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాయ్. ప్రక్కనే, ఆరంతస్థుల ప్యారిస్ బిల్డింగ్ భూతంలా మీదకు విరుచుకుపడ్తూన్నట్టుగా ఉంది! ఆ వాతావరణంలో భౌతికంగానూ మానసికంగానూ, ఎంతో చిన్నవాణ్ణయి పోతున్నట్టుగా అనిపించింది. మలుపు తిరుగుతూ ట్రాం- 'గర్-గర్'మని చేస్తూన్న ధ్వనికి నా స్మృతిపథంలో పదిహేను సంవత్సరాలుగా, చలనరహితంగా పడి ఉన్న రంగులరాట్నం కదిలింది. 'బర్-బర్' గిర్రున తిరిగిపోతుంది - గుర్రం, ఏనుగూ, ఉయ్యాలా, ఒంటె, విమానం రయ్యిన తిరిగిపోతున్నాయ్. కోరీ మీద తిరునాళ్ళో తిరుగుతున్న రంగుల రాట్నాన్ని చిత్రంగా చూస్తూ మాణిక్కాం పక్కన నుంచున్న నేనూ, నా ఆరేళ్ళ వయస్సూ, పొట్టి లాగూ, కొత్త చొక్కా, ఏడున్నరణాల చిల్లరా.... మళ్ళీ నాకొచ్చేసినయ్. "అమ్మగోరూ! అబ్బాయిగార్ని నా యెంట పంపండీ?" "అయితే, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తావా?" "ఓ! నా సంగతి మీకు తెలవదాండీ అమ్మగోరూ!" "ఏం రా, అబ్బాయ్! మాణిక్కాం వెంట వెళ్తావా?" అమ్మ అడిగీ అడగడంతోటే తల గిర్రున ఊపేశాను. తిరునాళ్ళకు వెళ్ళాలని కొండంత ఆశతో కూర్చున్న నాకు మాణిక్యాం తనతో తీసుకెళ్తాననగానే ఎంతో సంతోషం కలిగింది. పని మనిషి మాణిక్కాంమీద నా కంతవరకూ.......................© 2017,www.logili.com All Rights Reserved.