వివిధ భాషల్లోంచి సాగిన ప్రపంచ కథాయాత్రను పరిశీలిస్తే వెంటాడే కథలు ఎన్నెన్నో! ఈ భూగోళం పై ఉన్న ఆయా దేశాల ప్రజల జీవన విధానం, సామాజిక వ్యవస్థ, ప్రకృతి వనరులతో నిత్య సంఘర్షణను కథానిక సజీవంగా చూపుతుంది. ప్రపంచ సాహిత్యంలో మన తెలుగు కథ - కవిత సమధీటుగా నిలిచిపోయిన ప్రక్రియలు. ఆధునిక కథాశిల్ప సంవిధానం ఆయా ప్రపంచభాషలనుంచి అందుబాటులోకి వచ్చిన తర్వాత వైవిధ్యం సాధ్యమైంది. ఇతర భాషల కథా అద్భుతాలను తెలుసుకోవడానికి అనువాదాలే ఆధారమైనాయి. ముఖ్యంగా రష్యన్, ఫ్రెంచి, ఇంగ్లీషు, స్పానిష్ కథాసాహిత్యాన్ని ఈ అనువాద వారధి మాత్రమే సన్నిహితం చేసింది.
ఆధునిక కథానిక ప్రారంభమై ఇంకా రెండు శతాబ్దాలు దాటకపోయినా అది చూపించిన వైవిధ్యం ఎంతో విస్తృతమైనది. మానవజీవితాన్ని దాని సూక్ష్మాతిసూక్ష్మ కోణాలలో కథానిక పరిశీలించినట్లు మరే సాహిత్య ప్రక్రియా పరీశిలించ లేదు. వివిధ భాషలలోని కథానికలు ప్రపంచవ్యాప్తంగా మానవజీవన రీతుల్ని వర్ణిస్తాయి, విశ్లేషిస్తాయి. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ మన ముందుంచుతున్న వైవిధ్యభరితమైన విశ్వకథానికలివి.
వివిధ భాషల్లోంచి సాగిన ప్రపంచ కథాయాత్రను పరిశీలిస్తే వెంటాడే కథలు ఎన్నెన్నో! ఈ భూగోళం పై ఉన్న ఆయా దేశాల ప్రజల జీవన విధానం, సామాజిక వ్యవస్థ, ప్రకృతి వనరులతో నిత్య సంఘర్షణను కథానిక సజీవంగా చూపుతుంది. ప్రపంచ సాహిత్యంలో మన తెలుగు కథ - కవిత సమధీటుగా నిలిచిపోయిన ప్రక్రియలు. ఆధునిక కథాశిల్ప సంవిధానం ఆయా ప్రపంచభాషలనుంచి అందుబాటులోకి వచ్చిన తర్వాత వైవిధ్యం సాధ్యమైంది. ఇతర భాషల కథా అద్భుతాలను తెలుసుకోవడానికి అనువాదాలే ఆధారమైనాయి. ముఖ్యంగా రష్యన్, ఫ్రెంచి, ఇంగ్లీషు, స్పానిష్ కథాసాహిత్యాన్ని ఈ అనువాద వారధి మాత్రమే సన్నిహితం చేసింది. ఆధునిక కథానిక ప్రారంభమై ఇంకా రెండు శతాబ్దాలు దాటకపోయినా అది చూపించిన వైవిధ్యం ఎంతో విస్తృతమైనది. మానవజీవితాన్ని దాని సూక్ష్మాతిసూక్ష్మ కోణాలలో కథానిక పరిశీలించినట్లు మరే సాహిత్య ప్రక్రియా పరీశిలించ లేదు. వివిధ భాషలలోని కథానికలు ప్రపంచవ్యాప్తంగా మానవజీవన రీతుల్ని వర్ణిస్తాయి, విశ్లేషిస్తాయి. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ మన ముందుంచుతున్న వైవిధ్యభరితమైన విశ్వకథానికలివి.© 2017,www.logili.com All Rights Reserved.