సమకాలిన జీవితానికంతా ఒక దర్పణంగా మాత్రమే గాకుండా వ్యఖ్యానంగా, విమర్శగా, మార్గదర్శిగా గూడా వ్యవహరించ గల స్థాయికి తెలుగు కథానిక ఎదిగింది. అందువల్ల ప్రతి సంవత్సరమూ సాహిత్య సింహవలోకం చేస్తున్నప్పుడు సమకాలిన సమాజ స్థితిగతులను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడప్పుడూ సాహిత్య సింహావలోకనాలతో బాటూ చర్చలూ, ఇంటర్వూలు నిర్వహించవలసిన అవసరం కూడా ఉంది. ఈ చర్చల్లో సాహిత్య ప్రమాణాలను గురించిన విశ్లేషణ సాధ్యమవుతుంది.
మంచి కథలను ఎన్నికచేసి ప్రచురించడమే ఈ సంకలనాన్ని రచయితల పోటీకి వేదికగా గుర్తించవద్దని మేము కోరుకుంటున్నాము. రచన చేయడమన్నది రచయితలకొక సాధనగా మాత్రమే ఉండాలనీ, దాని పరమోద్దేశం సమాజ శ్రేయస్సు మాత్రమేనని గుర్తించాలి. అయితే సమాజ పరిణామాల పట్ల తమకు కలిగిన స్పందనను పాఠకుడి మనస్సులోకి సరపరా చేయడానికి రచయిత శిల్ప ప్రావీణ్యాన్ని పెంపొందించుకోక తప్పదు. ఈ సాధనలో రచయితలు తాము సాధించిన పరిణితిని బేరీజు వేసుకోవడానికి మా ఈ కథావార్షిక ఒక గీటురాయిగా తయారు కావాలన్న కోరిక మాత్రం మాకుంది.
సమకాలిన జీవితానికంతా ఒక దర్పణంగా మాత్రమే గాకుండా వ్యఖ్యానంగా, విమర్శగా, మార్గదర్శిగా గూడా వ్యవహరించ గల స్థాయికి తెలుగు కథానిక ఎదిగింది. అందువల్ల ప్రతి సంవత్సరమూ సాహిత్య సింహవలోకం చేస్తున్నప్పుడు సమకాలిన సమాజ స్థితిగతులను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడప్పుడూ సాహిత్య సింహావలోకనాలతో బాటూ చర్చలూ, ఇంటర్వూలు నిర్వహించవలసిన అవసరం కూడా ఉంది. ఈ చర్చల్లో సాహిత్య ప్రమాణాలను గురించిన విశ్లేషణ సాధ్యమవుతుంది. మంచి కథలను ఎన్నికచేసి ప్రచురించడమే ఈ సంకలనాన్ని రచయితల పోటీకి వేదికగా గుర్తించవద్దని మేము కోరుకుంటున్నాము. రచన చేయడమన్నది రచయితలకొక సాధనగా మాత్రమే ఉండాలనీ, దాని పరమోద్దేశం సమాజ శ్రేయస్సు మాత్రమేనని గుర్తించాలి. అయితే సమాజ పరిణామాల పట్ల తమకు కలిగిన స్పందనను పాఠకుడి మనస్సులోకి సరపరా చేయడానికి రచయిత శిల్ప ప్రావీణ్యాన్ని పెంపొందించుకోక తప్పదు. ఈ సాధనలో రచయితలు తాము సాధించిన పరిణితిని బేరీజు వేసుకోవడానికి మా ఈ కథావార్షిక ఒక గీటురాయిగా తయారు కావాలన్న కోరిక మాత్రం మాకుంది.© 2017,www.logili.com All Rights Reserved.