మార్మిక వచనం - కవితాత్మక కథనం
మనిషి ఒకడు కాదు, ఇద్దరు. ఒకడు
చీకటిలో వెలుతురయ్యేవాడు. ఒకడు
వెలుతురులో చీకటయ్యేవాడు.
- ఖలీల్ జిబ్రాన్
కథ ఎప్పటికీ నిలిచిపోయే వొక విశ్వజనీన కవిత్వరూపం. దీనికి వొక స్థిర సూత్రం లేదు. ఏ కథకు అదే సూత్రం దేనికి అదే శాశ్వతం. అది వాస్తవాలతో పాటు వాస్తవాల్లోని మార్మికతను కూడా పసిగట్టి చెబుతుంది. జీవితంలోని రహస్యాలను వొడిసిపట్టుకొని magicalగా మాట్టాడుతుంది. అసలైన కథ అంతు చిక్కదు. పాఠకుని యొక్క ఆత్మగౌరవం, ఆత్మరక్షణ తన గుణం. ఇది originality లోంచి పుడుతుంది. భూమి అంతమయిపోయేవరకు కథ ఎప్పటికీ తన కథను ముగించదు. కథ ఎప్పటికీ అంతం కాదు.
ఇటువంటి లక్షణాలున్న కథలు విరివిగా రావు. కళ్ళకు అంత తొందరగా తగలవు. కాలంలోంచి, ఎవరూ చూడకుండా దృష్టిని మళ్ళించే లోపల్నే జారిపోతుంటాయి. మంచి పాఠకుడికి మంచి కథ వొక accidental muse. అంతేకాక యాదృచ్ఛిక అనుభవాంతర పొర్లింత.
అజయ్ ప్రసాద్ కథలు ఇటువంటి మంచి పాఠకునికి తాదాత్యతను రగిలించిన కథలని అనిపించింది. ఇవి అచ్చమయిన, గాఢమయిన అతి మామూలు జీవితానికి దగ్గరగా మసలే 'వ్యక్తి' కథలు. ఇవి మనలోని 'నీరంధ్ర భయదాంధకార జీమూతాళి'.......................
© 2017,www.logili.com All Rights Reserved.