నాలో...
ఓ వింత కోరిక దాగి ఉంది!
నింగిని కాగితంలా
నక్షత్రాలను అక్షరాలుగా
వాడుకోవాలని ఉంది!
ఎంత ఎత్తుకు ఎగిరినా
ఎంత శూన్యాన్ని చేధించినా
ఎంతకూ వీడని
అంతులేని నిత్యనూతన
అంతరిక్ష యానంలా...
తొలిచే కొద్దీ
మలిచే కొద్దీ
కొంగ్రొత్త అనుభూతులను పంచే
అక్షర సమూహాన్ని
మీ ముందుంచాలని ఉంది!
తారల తళుకు బెళుకులు
భావగర్భిత కాంతిని
నా రచనల్లో నింపాలని ఉంది!
నక్షత్రాలను అక్షరాలుగా
వాడుకోవాలని ఉంది!!
- ఎస్సారే
శ్రీ ఎస్సారే కథలను చదవటం ప్రారంభించగానే ముందు మనం కథలో పాత్రగానో, జరుగుతున్న దానికి సాక్షిగానో మారుతం. తప్పదు! శ్రీ ఎస్సారే తన చుట్టూ వున్న సమాజాన్ని, జరుగుతున్న సంగతులను చూసే దృష్టి సంపూర్ణ మానవీయం. కనుకనే కథనమంతా తడి ఆరని గుండె లయగా సాగుతుంది. ఉద్వేగం తెలియని నిర్వేదం ఒకసారి ఆవేదనగా, మరొకసారి అభిశంసనగా బయటపడుతుంది. తీవ్రతకన్నా గాడట, ఆక్రోశంకన్నా ఆవేదన, కవితాత్మకన్నా భావాత్మ, విస్మృతికన్నా క్లుప్తత... కథలను ఆలోచనాత్మకం చేస్తూ మానవతను తట్టి లేపుతూనే ఉంటాయి. మానవ సమాజానికి శ్రీ ఎస్సారే 'కథాంజలి' ఏతమెత్తిన శుద్ధ భావాంజలి!
- వల్లూరు శ్రీరామచంద్రమూర్తి
నాలో... ఓ వింత కోరిక దాగి ఉంది! నింగిని కాగితంలా నక్షత్రాలను అక్షరాలుగా వాడుకోవాలని ఉంది! ఎంత ఎత్తుకు ఎగిరినా ఎంత శూన్యాన్ని చేధించినా ఎంతకూ వీడని అంతులేని నిత్యనూతన అంతరిక్ష యానంలా... తొలిచే కొద్దీ మలిచే కొద్దీ కొంగ్రొత్త అనుభూతులను పంచే అక్షర సమూహాన్ని మీ ముందుంచాలని ఉంది! తారల తళుకు బెళుకులు భావగర్భిత కాంతిని నా రచనల్లో నింపాలని ఉంది! నక్షత్రాలను అక్షరాలుగా వాడుకోవాలని ఉంది!! - ఎస్సారే శ్రీ ఎస్సారే కథలను చదవటం ప్రారంభించగానే ముందు మనం కథలో పాత్రగానో, జరుగుతున్న దానికి సాక్షిగానో మారుతం. తప్పదు! శ్రీ ఎస్సారే తన చుట్టూ వున్న సమాజాన్ని, జరుగుతున్న సంగతులను చూసే దృష్టి సంపూర్ణ మానవీయం. కనుకనే కథనమంతా తడి ఆరని గుండె లయగా సాగుతుంది. ఉద్వేగం తెలియని నిర్వేదం ఒకసారి ఆవేదనగా, మరొకసారి అభిశంసనగా బయటపడుతుంది. తీవ్రతకన్నా గాడట, ఆక్రోశంకన్నా ఆవేదన, కవితాత్మకన్నా భావాత్మ, విస్మృతికన్నా క్లుప్తత... కథలను ఆలోచనాత్మకం చేస్తూ మానవతను తట్టి లేపుతూనే ఉంటాయి. మానవ సమాజానికి శ్రీ ఎస్సారే 'కథాంజలి' ఏతమెత్తిన శుద్ధ భావాంజలి! - వల్లూరు శ్రీరామచంద్రమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.