ఏదైనా ఒక కథ చదివినప్పుడు పాఠకులలో కొంత కొత్త తెలివిడి, ప్రపంచం పై కొంత ప్రేమ కలగాలి. కనీసం తనకున్న దాని పై ఒక ఆరుశాతం అయినా ప్రపంచం పై ప్రేమ పెరగాలి. అంటాడు జార్జ్ శాండర్స్ అనే ప్రఖ్యాత రచయితా. ఆయనేమిటి, మనం కూడా అదే అనుకుంటాం. కథలు పాఠాలు కావు, చదువరులు అజ్ఞానులు కారు. అయినప్పటికీ ఒక మంచి కథ చదివినప్పుడు మనకు తెలియనిదేదో కొంత తెలిసినట్లు, ఈ ప్రపంచాన్ని మన జీవితాన్ని వాటి బలహీనతలతో సహా ప్రేమించి వాటిని మెరుగు పరుచుకునే పని ఏ కొంచెమో చెయ్యాలని అనిపిస్తుంది. కొత్త ఎరుక ఇవ్వకపోయినా, ప్రస్తుత ప్రపంచ పోకడని కళ్ళముందు పెట్టి "అవునా ఇలా వున్నామా మనం ?" అనైనా అనుకోగలగాలి.
- వల్లూరు శివప్రసాద్