'ఐదు పాలిచ్చే జంతువుల పేర్లు రాయమంటే అందులో నాలుగు ఆవులు ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించే ముళ్ళపూడి వెంకటరమణ గారి 'బుడుగు' అగ్రహారంలో రాధా గోపాలానికి కాకుండా రాంబిల్లిలో రాజులమ్మకీ, నూకరాజుకీ పుడితే ఎలా ఉంటుందీ? ఆర్కేనారాయణ్ 'స్వామి' మాల్గుడిలో కాకుండా యలమంచిలిలో చిరంజీవి పేరుతో చదువుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ఈ కథ. తొట్రుపాటు లేకుండా రాసిన తొలి నవల ఇది. ఒక మంచి ఫ్లో, మొదలు పెట్టామా, హాయిగా చదివించేస్తుంది. నిజజీవిత సంఘటనల్ని పేర్చడంలో నేర్పరితనం... నీళ్లు నమలడాలూ, కాళ్ళు తడబడ్డాలూ ఉండవు. సూటిగా ఘాటుగా అనుకున్నది అనుకున్నట్టుగా రాశాడు ప్రసాద్ సూరి. 21 ఏళ్ళకి నవల రాయడమే గొప్ప అనుకుంటే కొత్తతరం భాషతో, ఆశలతో అందంగా నడిపించడంలోని ప్రావీణ్యం ఆశ్చర్యపరుస్తుంది. ప్రామిస్ ఉన్న రచయిత ప్రసాద్. రానున్న ఉపద్రవాలకి ఈ 'చిరంజీవి' ఒక ప్రమాద సూచిక!
- తాడి ప్రకాష్
'ఐదు పాలిచ్చే జంతువుల పేర్లు రాయమంటే అందులో నాలుగు ఆవులు ఎందుకు ఉండకూడదు? అని ప్రశ్నించే ముళ్ళపూడి వెంకటరమణ గారి 'బుడుగు' అగ్రహారంలో రాధా గోపాలానికి కాకుండా రాంబిల్లిలో రాజులమ్మకీ, నూకరాజుకీ పుడితే ఎలా ఉంటుందీ? ఆర్కేనారాయణ్ 'స్వామి' మాల్గుడిలో కాకుండా యలమంచిలిలో చిరంజీవి పేరుతో చదువుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ఈ కథ. తొట్రుపాటు లేకుండా రాసిన తొలి నవల ఇది. ఒక మంచి ఫ్లో, మొదలు పెట్టామా, హాయిగా చదివించేస్తుంది. నిజజీవిత సంఘటనల్ని పేర్చడంలో నేర్పరితనం... నీళ్లు నమలడాలూ, కాళ్ళు తడబడ్డాలూ ఉండవు. సూటిగా ఘాటుగా అనుకున్నది అనుకున్నట్టుగా రాశాడు ప్రసాద్ సూరి. 21 ఏళ్ళకి నవల రాయడమే గొప్ప అనుకుంటే కొత్తతరం భాషతో, ఆశలతో అందంగా నడిపించడంలోని ప్రావీణ్యం ఆశ్చర్యపరుస్తుంది. ప్రామిస్ ఉన్న రచయిత ప్రసాద్. రానున్న ఉపద్రవాలకి ఈ 'చిరంజీవి' ఒక ప్రమాద సూచిక! - తాడి ప్రకాష్© 2017,www.logili.com All Rights Reserved.